రంగంలోకి నాలుగు మాన్సూన్​ స్పెషల్ ​టీమ్స్

రంగంలోకి నాలుగు మాన్సూన్​ స్పెషల్ ​టీమ్స్
  • గ్రేటర్​పరిధిలో అందుబాటులోకి తెచ్చిన వాటర్​బోర్డు
  • జీహెచ్ఎంసీ, పోలీస్​సిబ్బందితో కలిసి పనిచేసేలా ప్లాన్
  • మురుగు నీటి నిర్వహణ, వాన నీటి తొలగింపునకు చర్యలు

హైదరాబాద్, వెలుగు: మురుగు నీటి నిర్వహణ, వాన నీటి తొలగింపు, భారీ వర్షాల టైంలో ప్రమాదాల నివారణకు వాటర్​బోర్డు చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా మురుగు నీరు రోడ్లపై ఓవర్​ఫ్లో కాకుండా, మ్యాన్​హోళ్లు పొంగకుండా చూసేందుకు నాలుగు స్పెషల్​టీమ్స్ ను అందుబాటులోకి తెచ్చింది. మాన్సూన్​యాక్షన్​ప్లాన్​లో భాగంగా సెంట్రల్ సేఫ్టీ ప్రొటోకాల్ సెల్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, సేఫ్టీ ప్రొటోకాల్ టీమ్, డీఎస్ఆర్ టీమ్ ను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.

పోలీస్, జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బందితో కోఆర్డినేట్​చేసుకుంటూ ఈ టీమ్స్​పనిచేస్తాయని వెల్లడించారు. ప్రధానంగా తాగునీరు కలుషితం కాకుండా చూడనున్నాయి. రోడ్లపై మురుగు పొంగకుండా, భారీవర్షాలకు వరద పోటెత్తితే బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నాయి. వాటర్​పొల్యూషన్ ఐడెంటిఫికేషన్ యంత్రాలను వీటికి అందుబాటులో ఉంచినట్టు అధికారులు తెలిపారు.

సెంట్రల్ సేఫ్టీ ప్రొటోకాల్ సెల్

మాన్సూన్​పనుల పర్యవేక్షణకు వాటర్​బోర్డు మెట్రోవాటర్​బోర్డు రెండేండ్ల కింద ప్రత్యేకంగా సెంట్రల్ సేఫ్టీ ప్రొటోకాల్ సెల్(సీఎస్ పీఎస్)ను ఏర్పాటు చేసింది. ఇందులో ఆరుగురు సభ్యులు ఉంటారు. చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ సెల్​పనిచేస్తుంది. ఇందులో పెట్రోలింగ్ వెహికల్, కానిస్టేబుల్, ఇద్దరు హోంగార్డులతోపాటు కమ్యూనికేషన్ సామగ్రి ఉంటుంది.

ఈ సెల్ క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి వచ్చే రోజువారిగా వచ్చే ఫిర్యాదులపై ఆడిట్ చేస్తుంది. రిపోర్టులను పర్యవేక్షిస్తుంది. పనులు జరిగే ప్రాంతాల్లో భద్రతా చర్యలు పాటించేలా చూస్తుంది. స్థానికులు నేరుగా ఈ సెల్​కు ఫిర్యాదు చేయొచ్చు. డివిజన్​ఆఫీసులో చీఫ్ సేఫ్టీ ప్రోటోకాల్ ఆఫీసర్ అందుబాటులో ఉంటారు. 

ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్

ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్(ఈఆర్ డీ)​ వర్షా కాలంలో కీలకంగా వ్యవహరించనుంది. వానల టైంలో రోడ్లపై మురుగు, వర్షపు నీరు కలిసి ఓవర్​ఫ్లో సహాయక చర్యలు చేపట్టనుంది. సమాచారం అందిన వెంటనే వరద ముంపు ప్రాంతానికి చేరుకుని చర్యలు చేపడుతుంది. ఆయా ప్రాంతాల్లోని పోలీసులు, జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ టీమ్ తో కలిసి సమన్వయం పనిచేస్తుంది. 

సేఫ్టీ ప్రొటోకాల్ టీమ్

ఇది మెట్రోవాటర్​బోర్డుకు సంబంధించిన ప్రత్యేక భద్రతా బృందం. ఆయా ప్రాంతాల్లో బోర్డు నిర్వహించే పనులను, పని ప్రదేశాల్లో భద్రతా చర్యలు పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తుంది. అన్ని ఓ అండ్ ఎం డివిజన్ల పరిధిలో జరుగుతున్న  సైట్లలో తనిఖీలు చేపడుతుంది. పని జరిగే ప్రదేశాల్లో సూచికలు ఏర్పాటు మొదలుకుని జియో ట్యాగింగ్ వరకు పర్యవేక్షిస్తుంది. అధికారులు డివిజన్ కు ఒక టీమ్​ను కేటాయించారు.

డీఎస్ఆర్ టీమ్

డీఎస్ఆర్ టీమ్​లోని సభ్యులు వర్షాలు కురుస్తున్న సమయంలో రోడ్లపైకి వస్తారు. జీహెచ్ఎంసీ గుర్తించిన వాటర్​లాగింగ్ పాయింట్స్, ప్రమాదకర మ్యాన్ హోల్స్ వద్ద అందుబాటులో ఉంటారు. వర్షా కాలమంతా రోజూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు. డైలీ సిచువేషన్ రిపోర్టు(డీఎస్ఆర్)ను తయారు చేసి ఉన్నతాధికారులకు పంపిస్తారు. అలాగే వాటర్ లాగింగ్ పాయింట్ వద్ద ఒక వ్యక్తిని నియమించి  పరిస్థితిని పర్యవేక్షించనున్నారు.