ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు..రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ

ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు..రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ

ఉత్తరాఖండ్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.ఆదివారం (జూలై 7)  భారీ వర్షాలతో రిషికేశ్ లోని గంగానది ఉధృతంగా ప్రవహిస్తోంది. నది నీటి మట్టం థ్రివేణి ఘాట్ ఆరతి స్థలానికి చేరుకోవడంతో ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేసింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. రాత్రి పూట ఘాట్ లకు వెళ్లొద్దని హెచ్చరించింది. మరో వైపు జూలై 10 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 

కుమావోన్ ప్రాంతంలో పలుచోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. జూలై 7(ఆదివారం ) ఉత్తరాఖండ్ లోని చమోలి, రుద్రప్రయాగ, పౌరీ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. డెహ్రాడూన్, టెహ్రీ, హరిద్వార్, ఉత్తరకాశీ జిల్లాల్లో ఆదివారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. భారీ వర్షాల కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం సూచించింది.  

మ్మిది జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సీఎం పుష్కర్ సింగ్ ధామి అన్ని జిల్లాల మేజిస్ట్రేట్ లను ఆదేశించారు.