బలహీనపడిన రుతుపవనాలు..అలర్ట్ ఉన్న జిల్లాలివే..

బలహీనపడిన రుతుపవనాలు..అలర్ట్ ఉన్న జిల్లాలివే..
  • రాష్ట్రం నుంచి తిరోగమనం
  • రేపటి నుంచి మూడు రోజులు భారీ వర్షాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నైరుతి రుతు పవనాలు బలహీనపడ్డాయి. మెల్లగా రాష్ట్రం నుంచి నిష్క్రమించనున్నట్లు వాతావరణ శాఖ గురువారం వెల్లడించింది. ఇక, శనివారం నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని ప్రకటించింది. శనివారం ఏడు జిల్లాలు, ఆదివారం 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌‌ జారీ చేసింది.

సోమవారానికి మాత్రం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎఫెక్ట్ అయిన జిల్లాలు సహా 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌‌ను ఇచ్చింది. హైదరాబాద్ సిటీలో.. వచ్చే రెండు రోజులూ మబ్బులు పట్టి ఉంటుందని, తేలికపాటి జల్లులు లేదా మోస్తరు వర్షం పడేందుకు అవకాశాలున్నాయని పేర్కొన్నది.

అలర్ట్ ఉన్న జిల్లాలివే.. 

శనివారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెంలో వర్షాలకు పడే చాన్స్ ఉన్నది. ఇక, ఆదివారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మహబూబ్ నగర్, సోమవారం.. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలున్నాయి.