అక్టోబర్ 6న మంత్ ఆఫ్ మధు విడుదల

నవీన్ చంద్ర, స్వాతి రెడ్డి జంటగా  శ్రీకాంత్ నాగోతి తెరకెక్కించిన చిత్రం ‘మంత్ ఆఫ్ మధు’. యశ్వంత్ ములుకుట్ల నిర్మించిన ఈ సినిమా  అక్టోబర్ 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత యశ్వంత్ మాట్లాడుతూ ‘భానుమతి అండ్ రామకృష్ణ’ తర్వాత  శ్రీకాంత్ దర్శకత్వంలో నేను నిర్మించిన చిత్రమిది. ఇదొక లైఫ్ డ్రామా. ప్రతి ఒక్కరి లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హనీమూన్ పీరియడ్ ఉంటుంది. అది బ్యూటిఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది.

అయితే అది లైఫ్ లాంగ్ ఉండాలని లేదు. దీనితో పాటు జీవితంలో అప్ అండ్ డౌన్స్ కూడా ఉంటాయనేది వాస్తవం. దీన్ని చూపించే ప్రయత్నమే ఈ చిత్రం. దాదాపు అన్ని లైవ్ లొకేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  సింక్ సౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో షూట్ చేశాం. ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కచ్చితంగా డిఫరెంట్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీరియెన్స్ ఇస్తుంది. నవీన్ చంద్ర, డైరెక్టర్ శ్రీకాంత్, హర్ష ఇలా మా టీమ్ అంతా రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కలిసే క్లోజ్ ఫ్రెండ్స్. నవీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కథ బాగా  నచ్చింది.

నవీన్, స్వాతి ఇద్దరూ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మధు పాత్రకు అమెరికా నుంచి వచ్చిన ఓ అమ్మాయి కావాలి. అదే సమయంలో నటన వచ్చి ఉండాలి. అలా శ్రేయాని తీసుకున్నాం.  ఈ పాత్రను ఆమె బాగా చేసింది. ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా కీలకంగా ఉంటుంది. రవికాంత్ దీన్ని బాగా చేశారు.  అచ్చురాజమణి మంచి  మ్యూజిక్ ఇచ్చారు. ఇదొక డిఫరెంట్ జానర్ సినిమా. ట్రైలర్ విడుదలయ్యాక బజ్ పెరిగింది. అలాగే బిజినెస్ పరంగా హ్యాపీగా ఉన్నాం’ అని చెప్పారు.