Month Of Madhu Review: ఎమోషనల్గా సాగిన మంత్ ఆఫ్ మధు.. కానీ?

Month Of Madhu Review: ఎమోషనల్గా సాగిన మంత్ ఆఫ్ మధు.. కానీ?

నవీన్ చంద్ర(Naveen chandra),స్వాతి(Swathi), మంజుల(Manjula), వైవా హర్ష(Viva harsha) తదితరులు ప్రధాన పాత్రలో వచ్చిన మూవీ మంత్ ఆఫ్ మధు(Month of madhu). కొత్త దర్శకుడు శ్రీకాంత్ నాగోతి(Srikanth nagothi) తెరకెక్కించిన ఈ సినిమాను యశ్వంత్ ములుకుట్ల(Yashwanth mullukutla) నిర్మించారు. ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా నేడు(అక్టోబర్ 6) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  మరి ఈ సినిమా ఎలా ఉంది? ఆడియన్స్ ను ఏమేరకు మెప్పిచింది? అనేది ఈ రివ్యూలో చూద్దాం. 

కథ: మధుసూధన్ రావు(నవీన్ చంద్ర) వైజాగ్ లో గవర్నమెంట్ ఉద్యోగి కానీ.. కొన్ని కారణాల వల్ల ఉద్యోగం పోగొట్టుకుంటాడు. భార్య లేఖ(స్వాతి) విడాకుల కేసు పెట్టి వెళ్ళిపోతుంది. ఎప్పటికైనా ఆమె తిరిగి వస్తుందని ఎదురుచూస్తూ.. మద్యానికి బానిస అవుతాడు. ఈ క్రమంలోనే ఒక పెళ్ళిలో మధుసూదన్ రావుకు మధుమతి(శ్రియ నవిలే) పరిచయం అవుతుంది. అతని గతాన్ని తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఎం జరిగింది? లేఖ విడాకుల కేసు ఎందుకు పెట్టింది? మధుసూదన్- లేఖ కలిశారా? లేదా? అనేది మిగిలిన కథ. 

విశ్లేషణ: మంత్ ఆఫ్ మధు.. అమెరికా నుంచి వైజాగ్ వచ్చిన మధు అనే అమ్మాయికి నెల రోజుల్లో ఎదురైనా అనుభవాలే ఈ సినిమా. మన సినిమాలెందుకు సహజత్వానికి దూరంగా ఉంటాయి అనేది చాలా మంది ప్రేక్షకుల్లో ఉన్న ప్రశ్న. దానికి సమాధానమే మంత్ ఆఫ్ మధు మూవీ. కాలేజీ ప్రేమ, అందులో ఉండే ప్యూర్ ఎమోషన్స్, ఏకాంతంగా కలవడం, ప్రెగ్నన్సీ, దాన్ని తీయించుకోవడానికి చేసే ప్రయత్నం, ఇద్దరి మధ్య మనస్పర్థాలు ఇలా చాలా ఎలిమెంట్స్ లో చాలా  సహజంగా అనిపిస్తుంది మూవీ. ఎక్కడ సినిమా చూస్తున్న ఫీల్ రాదు.

కానీ.. చూసే ప్రేక్షకులు మాత్రం సినిమాకు ఎమోషనల్ గా కనెక్ట్ కాలేక పోతారు. కారణం సినిమా కథను చాలా ఆలస్యంగా రివీల్ చేయడం. న్యరేషన్ కూడా చాలా స్లో గా ఉంటుంది. దీంతో ఆడియన్స్ బోర్ ఫీలవుతారు. తీసుకున్న పాయింట్స్ బాగున్నా.. సరిగా ఎష్టాబ్లిష్ చేయలేకపోయాడు దర్శకుడు. దీంతో మంత్ ఆఫ్ మధు ఒక మంచి ప్రయత్నంగా మిగిలిపోయింది.

నటీనటులు: మధుసూధన్ రావు పాత్రలో నవీన్ చంద్ర ఒదిగిపోయారు. ఎమోషనల్ నటనతో మెప్పించారు. ఇక లేఖ పాత్రలో స్వాతి ఒదిగిపోయారని చెప్పాలి కానీ..  ఈ రెండు పాత్రల్లో సోల్ మిస్ కావడంతో వారి నటన తేలిపోయింది. మహేష్ సోదరి మంజుల, వైవా హర్ష కూడా పాత్రల మేర బాగానే నటించారు. ఇక కథను ముందుండి నడిపించిన శ్రియ నవిలే అసలు సూట్ అవలేదు అనిపించింది. ఆమె మాట్లాడే భాష ఆడియన్స్ కు చిరాకు తెప్పిస్తుంది. 

సాంకేతిక నిపుణులు: అచ్చు రాజమణి అందించిన పాటలు,  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. సినిమాటోగ్రఫీ కూడా ప్లెజెంట్ గా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.

ఇక మొత్తంగా చెప్పాలంటే.. మంత్ అఫ్ మధు రెగ్యులర్ ఆడియన్స్ కు నచ్చడం కష్టమే అనిపిస్తుంది.