నవీన్ చంద్ర, స్వాతి రెడ్డి జంటగా శ్రీకాంత్ నాగోతి దర్శకత్వంలో యశ్వంత్ ములుకుట్ల నిర్మించిన చిత్రం ‘మంత్ ఆఫ్ మధు’. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి లభిస్తున్న రెస్పాన్స్ తెలియజేసేందుకు శనివారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. నవీన్ చంద్ర మాట్లాడుతూ ‘నిజాయితీగా ప్రయత్నించిన సినిమా ఇది. మంచి రివ్యూస్ వస్తున్నాయి. మధు పాత్రకు మరింత రెస్పాన్స్ వస్తోంది.
సినిమా చూసిన వారందర్నీ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేయాలని కోరుతున్నా’ అన్నాడు. స్వాతి మాట్లాడుతూ ‘లైఫ్ డ్రామాని కొత్తగా ప్రజెంట్ చేసిన ఈ చిత్రానికి మంచి ఆదరణ దక్కుతోంది. లేఖ పాత్ర గురించి గర్వంగా చెప్పుకుంటాను. నా కెరీర్‌లో సుబ్రమణ్యపురం, అష్టా చెమ్మా చిత్రాల తరహాలో ఈ సినిమా కూడా గొప్ప విజయం సాధిస్తుంది’ అని చెప్పింది. శ్రీకాంత్ మాట్లాడుతూ ‘లిమిటెడ్ స్క్రీన్స్‌లోనే సినిమాని విడుదల చేశాం. రెస్పాన్స్ బాగుండడంతో ఎక్కువమందికి చేరువయ్యేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం’ అన్నాడు. ‘ఆడియెన్స్ కొత్తదనం ఫీలవడం హ్యాపీగా ఉంది. యూఎస్ లో కూడా షోస్ హౌస్‌ఫుల్ అవుతున్నాయి’ అని నిర్మాత చెప్పారు.