ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం స్పోర్ట్స్ బడ్జెట్‌ను కొద్దిగా పెంచింది. మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2024-–25 బడ్జెట్‌లో స్పోర్ట్స్‌కు రూ. 3,442.32 కోట్లు కేటాయించింది. గతేడాది (రూ. 3,396.80 కోట్లు)తో పోలిస్తే రూ. 45.36 కోట్ల మొత్తం పెరిగింది.
ALSO READ : ఓరుగల్లుకు మొండిచేయి ఎంపీ ఎలక్షన్ బీజేపీ మేనిఫెస్టోలోని ఒక్క ప్రాజెక్ట్రాలే
రూరల్ లెవెల్లో క్రీడాకారులను వెలికితీసేందుకు కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఖేలో ఇండియా’ కార్యక్రమానికి ప్రాధాన్యత లభించింది. దీనికి గతేడాది కంటే రూ. 20 కోట్లు పెంచి రూ. 900 కోట్లను కేటాచించింది. ఖేలో ఇండియా తర్వాత అత్యధికంగా టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్‌కు రూ. 822.60 కోట్లు,నేషనల్ స్పోర్టస్ షెడరేషన్స్‌కు రూ. 340 కోట్లు కేటాయించింది.