
భైంసా, వెలుగు: శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ఆరో రోజు అమ్మవారు కాత్యాయని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం కావడంతో వేకుజాము నుంచే అక్షరాభ్యాసాలు ప్రారంభమయ్యాయి.
గతంతో పోలిస్తే ఈ సంవత్సరం భక్తుల రద్దీ తగ్గింది. అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు తరలి వచ్చారు. ఆలయ చైర్మన్ శరత్ పాఠక్, ఈఓ విజయరామారావు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.