చూడు ఒకవైపే చూడు, రెం డో వైపు చూడాలనుకోకుతట్టుకోలేవ్.. అన్న సినిమా డైలాగ్ చంద్రుడి విషయంలో చక్కగా సరిపోతుంది. చంద్రుడిపై మనిషి కాలుమోపి సంవత్సరాలు గడిచాయి. అయినా చందమామ ముఖమే తప్ప వీపుచూసే అవకాశం నిన్నమొన్నటి వరకూ దొరకలేదు. ఎందుకంటే చంద్రుడు ఎప్పుడూ భూమికి అభిముఖంగానే ఉంటాడట. ఆ కొరత తీరేలా చైనా ఉపగ్రహం ఓ చక్కని ఫొటో పంపించింది.
చంద్రుడి చుట్టూ తిరుగుతున్న లాంగ్జియాం గ్–2 శాటిలైట్ తీసిన ఈ ఫొటో అత్యంత అరుదైందనే చెప్పొచ్చు. ఒకే ఫ్రేంలో చంద్రుడి వీపు భాగం.. ఆ వెనకే చిన్నబాల్ సై జులో నీలిరంగులో మెరుస్తున్న భూమిని ప్రొఫెషనల్ కెమెరామెన్ లా బంధించింది. గతేడాది జూన్ లో అంతరిక్షంలోకి వెళ్లిన ఈ ఉపగ్రహం ఈ నెల 3న ఈ అద్భుతమైన ఫొటోను తీసి పంపించింది.