దేశంలో రేపటి(మార్చి 2) నుంచి రంజాన్ మాసం ప్రారంభం

దేశంలో రేపటి(మార్చి 2) నుంచి రంజాన్ మాసం ప్రారంభం

దేశంలో ఇస్లాం పవిత్ర రంజాన్ మాసం ఆదివారం(మార్చి 2) నుండి ప్రారంభం కానుంది. శనివారం సాయంత్రం దేశవ్యాప్తంగా నెలవంక కనిపించడంతో మతపెద్దలు ఈ ప్రకటన చేశారు. ప్రత్యేక ప్రార్థనల కోసం ఇప్పటికే మసీదులు ముస్తాబయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ పాతబస్తీ సందడిగా మారింది. 

రేపటి నుండి పవిత్ర మాసం ప్రారంభం కానుండటంతో, హైదరాబాద్ సహా దేశంలోని ప్రముఖ నగరాల్లోని వ్యాపార సంస్థలు, రెస్టారెంట్లు తమ సన్నాహాలను ముమ్మరం చేశాయి. రంజాన్‌ మాసంలో ముస్లింలు కఠినమైన ఉపవాసాలను పాటిస్తారు. సాయంత్రం నుండి తెల్లవారుజాము వరకు నీరు కూడా తాగరు.

ప్రముఖ నగరాల్లో సెహ్రీ, ఇఫ్తార్ సమయాలు

  • ముంబై: సెహ్రీ - 5:45 AM; ఇఫ్తార్ - 6:45 PM
  • ఢిల్లీ: సెహ్రీ- 5:28 AM; ఇఫ్తార్ - 6:23 PM
  • చెన్నై: సెహ్రీ -5:19 AM; ఇఫ్తార్ - 6:00 PM
  • హైదరాబాద్: సెహ్రీ - 5:32 AM; ఇఫ్తార్ - 6:02 PM
  • బెంగళూరు: సెహ్రీ - 5:30 AM; ఇఫ్తార్ - 6:14 PM
  • కోల్‌కతా: సెహ్రీ - 4:59 AM; ఇఫ్తార్ - 5:11 PM

వేసవి కాలంతో రంజాన్.. 

దాదాపు 33 ఏళ్ల తరువాత రంజాన్ మాసం రంజాన్ వేసవి కాలంతో ప్రారంభమవుతోంది. గతంలో 1992లో రంజాన్ మాసం వేసవితో ప్రారంభమయ్యింది. తదుపరి 2047లో రావొచ్చని అంచనా.  ఈ సంవత్సరం రంజాన్ నెలలో ఉపవాస వ్యవధి 13 గంటల 17 నిమిషాల నుండి 13 గంటల 45 నిమిషాలకు పెరుగుతుంది. వేసవి కాలంలో రోజులు గడిచేకొద్దీ ఈ సమయంలో మార్పులు ఉంటాయి. 

ఇదిలావుంటే, సౌదీ అరేబియాలో రంజాన్ మాసం శనివారం(మార్చి 1) నుండి ప్రారంభమైంది. ఎందుకంటే వారికి శుక్రవారం చంద్రుడు కనిపించాడు.