మార్చి 17న తులారాశిలోకి చంద్రుడు.. మూడు రాసుల వారికి డబుల్​ ధమాకా అంట..!

మార్చి 17న  తులారాశిలోకి చంద్రుడు.. మూడు రాసుల వారికి డబుల్​ ధమాకా అంట..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు కన్యారాశి నుంచి తులారాశిలోకి మార్చి 17న తెల్లవారుజామున  1.15 (  మార్చి 16 అర్దరాత్రి) గంటలకు ప్రవేశించబోతున్నాడు.  ఇప్పటికే తులారాశిలో ఉన్న శుక్రుడితో కలిసి సంచరిస్తాడు .  దీని ప్రభావంతో మూడు రాశుల వారికి (  మిథున.. కర్కాటకం.. తులా రాశుల వారికి విశేషమై ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  శుక్రుడు , చంద్రుడి సంయోగ ప్రభావం 12 రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. . .  

మేషరాశి:  తులారాశిలో చంద్రుడు.. శుక్రుడు కలయిక  మేష రాశి వారికి వారసత్వ ఆస్తి వచ్చే అవకాశం ఉంది.  కొత్త వస్తువులు కొనుగోలు ..  కొత్త పరిచయాలు ఏర్పడుతాయి.  అనుకోకుండా ఖర్చులు రావడంతో ఆర్ధికంగా కొన్ని ఒడుదుడుకులు ఉంటాయని పండితులు చెబుతున్నారు.  నిరుద్యోగులకు దూరంగా జాబ్​ లభిస్తుంది.  వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి.  ప్రేమ విషయాన్ని వాయిదా వేసుకోండి.  పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.  

వృషభరాశి: తులారాశిలో చంద్రుడు.. శుక్రుడు కలయిక వలన వృషభరాశి వారు చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి.  ఆగిపోయిన పనుల్లో కూడా పురోభివృద్ది ఉంటుంది.  జీవిత భాగస్వామి సలహా తీసుకోండి.  ఎలాంటి ఇబ్బంది లేకుండా నిదానంగా అంతా మంచే జరుగుతుంది.  ఓర్పు.. సహనంతో ఉండండి.  ఉద్యోగస్తులు అధికంగా శ్రమ పడాల్సి ఉంటుంది.  మొండి బకాయిల వసూళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి.  వ్యాపారస్తులకు అతి కొద్దిపాటి లాభాలు వస్తాయి.  ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 

మిథునరాశి: మిథున రాశి వారికి కూడా శుక్రుడు, చంద్రుడి కలయిక కారణంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. వీరికి ఈ సమయంలో అనేక శుభసంకేతాలు అందుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు.   వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పుడితే అధికంగా లాభాలు వస్తాయి.  ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  గతంలో రావలసిన మొండి బకాయిలు వసూలవుతాయి.  ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి. 

కర్కాటకరాశి:  ఈ రాశివారికి అన్ని విధాలా బాగుంటుంది.  నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.  ఉద్యోగస్తులకు  ప్రమోషన్​ తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది.కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి.  విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. జీవిత భాగస్వామితో చర్చించి నిర్ణయాలు తీసుకోండి.  వ్యాపారస్తుల విషయంలో పెట్టిన పెట్టుబడుల్లో కూడా చాలా లాభాలు వస్తాయికార్యాలయంలో సహోద్యోగుల సహాయంతో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. 

సింహరాశి: ఈ రాశి వారికి చంద్రుడు.. శుక్రుడు కలయిక వలన కొన్ని ప్రతికూల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.  ఉద్యోగస్తులు .. మీ ప్రమేయం లేకుండానే మాట పడాల్సిన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.  ప్రతి విషయంలో కూడా తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు.  వ్యాపారస్తులు  కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది.  ఏది ఏమయినా చాలా ఓర్పు .. సహనంతో ఉండండి.. అంతా మంచే జరుగుతుంది.  ఏమాత్రం  నిరుత్సాహ పడకుండా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించండి. 

కన్యారాశి: ఈ రాశి వారికి చంద్రుడు.. శుక్రుడు కలయిక వలన అంతా మంచే జరుగుతుంది.  కొత్తగా చేపట్టిన పనులు విజయవంతమవుతాయి.  ఆర్థికసమస్యలు పరిష్కారమవుతాయి.  పూర్వీకుల ఆస్తి విషయంలో చర్చలు ఫలిస్తాయి.  కొత్తగా ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.నూతనంగా కొన్ని ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంది.  వివాహ సంబంధాలు కుదురుతాయి.  నిరుద్యోగులకు జాబ్​ ఆఫర్​ వస్తుంది.  వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల సమయని పండితులు సూచిస్తున్నారు. 

తులారాశి: చంద్రుడు.. శుక్రడు.. తులారాశిలో కలవడం వలన ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.  కొత్తగా ఇల్లుగాని..భూమి కాని కొనే అవకాశం ఉంది.  ఉద్యోగం మారే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది.  అయితే కొత్తగా పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి.  ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకపోయినా ఆలోచించి నిర్ణయం తీసుకోండి.  కుటుంబసభ్యల సలహాలకు ప్రాధాన్యత ఇవ్వండి.  ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవితం సాఫీగా సాగిపోతుంది.

వృశ్చిక రాశి: తులా రాశిలో చంద్రుడు  సంచరిస్తున్నందువల్ల, మీరు తలపెట్టిన కార్యాలను చెడగొట్టే వారుంటారు. ప్రతి విషయంలోనూ వీలైనంత రహస్యంగా, గోప్యంగా ఉండడం మంచిది. అనవసర స్నేహాలకు దూరంగా ఉండాలి. డబ్బు కలిసి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ దాని గురించి బయట వెల్లడి చేయకపోవడం అవసరం. మానసిక బలహీనత ఏర్పడే సూచనలున్నాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు.

ధనుస్సురాశి:  తులారాశిలో చంద్రుడు.. శుక్రుడు శుభ స్థానంలో ఉండటం వల్ల ఈ రాశి వారి  అన్ని విధాలా బాగుంటుంది.  ఉద్యోగస్తులకు పనిభారం పెరిగినా..సంతృప్తికరంగానే ఉంటుంది. వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది. జీవితంలో పెను మార్పులు వస్తాయి. సంపద పెరుగుతుంది.మనసులోని బాధలు తొలగిపోవడం, మనసులోని కోరికలు నెరవేరడం వంటివి చోటు చేసుకుంటాయి. తల్లి లేదా తల్లి వైపు వారి నుంచి ప్రేమాభిమానాలు చూరగొంటారు.

మకరరాశి:  ఈ రాశి వారికి చంద్రుడు.. శుక్రుడు గ్రహాలు కలయిక వలన మిశ్రమ ఫలితాలు కలుగుతాయి.  ఆవేశానికి లోనుకాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.  ఉద్యోగస్తులకు కొన్ని చికాకులు.. ఆందోళన కలుగుతుంది.  మీ గురించి కొందరు పనిగట్టుకుని చెడు ప్రచారం చేయడం, చాడీలు చెప్పడం వంటివి జరుగుతాయి. నరఘోష ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిదని పండితులు సూచిస్తున్నారు. 

కుంభరాశి: తులా రాశిలోనే శుక్ర, చంద్రుల సంయోగం జరుగుతుంది. ఫలితంగా ఈ రాశి జాతకుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జీవితాన్ని భౌతిక సౌకర్యాలతో గడుపుతారు. దీర్ఘకాలిక సమస్యలు తొలగుతాయి. జీవిత భాగస్వామి సహకారంతో మనస్సు సంతోషంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఆఫీసులో కీ రోల్​పోషిస్తారు. ఉన్నతాధికారుల నుంచి అవార్డ్​లు.. బోనస్​ లు అందుకుంటారు. వ్యాపారస్తులకు అధికంగా లాభాలుంటాయి. ప్రేమ .. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.

 మీన రాశి: మీన రాశి వారికి కెరీర్ పరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీరు ఉద్యోగం మారేందుకు కూడా ప్రయత్నించొచ్చు. ఈ కాలంలో మీరు చాలా ఓపికగా పని చేయాలి. కొందరు నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. అయితే మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈవెంట్ మేనెజ్‌మెంట్, టెక్నికల్ రంగాలతో అనుబంధం ఉన్న వారికి పని పరంగా మే తర్వాత కాలం బాగుంటుంది. ఉద్యోగులు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది.

ALSO READ | ఆధ్యాత్మికం : ఆ గుడికి వెళితే ఉద్యోగం, ఆరోగ్యం గ్యారంటీ.. మగాళ్లు వెళ్లాలంటే మాత్రం స్త్రీలా రెడీ అవ్వాలి.. !