ముసారాంబాగ్ బ్రిడ్జి మూసివేత.. ట్రాఫిక్ మళ్లింపు ఇలా..

ముసారాంబాగ్  బ్రిడ్జి మూసివేత.. ట్రాఫిక్ మళ్లింపు ఇలా..

హైదరాబాద్:  మూసీ నదిపై ముసారాంబాగ్ ఫ్లై ఓవర్  నిర్మాణం జరుగుతున్నందున ఈ మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఈ క్రమంలో  ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తాయని హైదరాబాద్  ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.

అంబర్‌పేట్ నుండి మూసారాంబాగ్ ఫ్లై ఓవర్  మీదుగా మలక్‌పేట టీవీ టవర్ వైపు వెళ్లే అన్ని సాధారణ వాహనాలు, భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులను అలీ కేఫ్ ఎక్స్ రోడ్ వద్ద జిందాతిలిస్మత్, గోల్నాక న్యూ బ్రిడ్జ్ హైటెక్ ఫంక్షన్ హాల్, అఫ్జల్‌నగర్ వైపు మళ్లించబడతాయి.

అక్కడి నుంచి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద కుడి మలుపు తిరిగి పిస్తా హౌస్ , మూసారాంబాగ్ జంక్షన్ వైపు వెళ్లాలని  పోలీసులు వెల్లడించారు.  ట్రాఫిక్ కు అంతరాయం కల్గకుండా వాహనదారులు ఇతర మార్గాల ద్వారా వెళ్లి... సహకరించాలని కోరారు పోలీసులు.