కబ్జాకు గురవుతున్న మూసీ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూములు

  • 118 ఎకరాల్లో మిగిలింది 58 ఎకరాలే...
  • రెవెన్యూ ఆఫీసర్ల అండతో అక్రమ పట్టాలు
  • స్వాధీనం చేసుకోవాలని ఆదేశించిన కోర్టు
  • అయినా పట్టించుకోని ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు

సూర్యాపేట, వెలుగు :రెవెన్యూ, ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్ల మధ్య కో ఆర్డినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకపోవడంతో కోట్ల విలువైన మూసీ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూములు కబ్జాకు గురవుతున్నాయి. ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన భూములను కొందరు వ్యక్తులు అక్రమంగా పట్టాలు చేసుకొని రైతు బంధు కూడా తీసుకుంటున్నారు. భూములను స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆదేశించినా ఆఫీసర్లలో స్పందన కనిపించడం లేదు. దీంతో మిగిలిన కొద్దిపాటి భూమిని సైతం కబ్జా చేసేందుకు కొందరు లీడర్లు పావులు కదుపుతున్నారు. 

118 ఎకరాల ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూములు

ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే రెండో పెద్ద ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన మూసీని 1963లో సూర్యాపేట మండలం సోలిపేట వద్ద నిర్మించారు. ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మాణ సమయంలోనే రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమీపంలోని కేతేపల్లి మండలం బొప్పారం, కాసనగోడు రెవెన్యూ పరిధిలోని ఎస్సీల అభివృద్ధికి 118 ఎకరాలను కేటాయించారు. అయితే ఆ భూములు తీసుకున్న ఎస్సీలు వాటిని సాగు చేసుకోకపోవడంతో ప్రభుత్వం ఆ భూములను తిరిగి ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లకు అప్పగించింది. దీంతో ఆ భూములను ప్రతి సంవత్సరం వేలం వేసి కౌలుకు ఇచ్చేవారు. 2014 నుంచి ఆ విధానానికి కూడా స్వస్తి పలకడంతో స్థానిక రైతులే ఆ భూములను సాగు చేసుకుంటున్నారు.

చేతులు మారిన 60 ఎకరాలు

భూములను కాపాడాల్సిన ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్ల నిర్లక్ష్యానికి తోడు రెవెన్యూ ఆఫీసర్ల అవినీతి కారణంగా భూములు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లాయి. రెవెన్యూ ఆఫీసర్ల అండదండలతో సర్వే నెంబర్ 216, 217, 218లోని భూములను కొందరు వ్యక్తులు అక్రమంగా రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకున్నారు. ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలో మొత్తం 118 ఎకరాల భూమి ఉండగా ఇందులో 60 ఎకరాలు చేతులు మారాయి. కొంతకాలం కిందట భూములను స్వాధీనం చేసుకునేందుకు ఆఫీసర్లు ప్రయత్నించగా ఆ భూములు తమవేనంటూ ఆక్రమించిన వ్యక్తులు కోర్టును ఆశ్రయించారు. అయినా సరైన ఆధారాలు లేవని, ఆ భూములను ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు స్వాధీనం చేసుకోవాలని కోర్డు ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. కానీ భూములను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ఆఫీసర్లు ప్రయత్నించడం లేదు. భూములను కబ్జా చేసిన వారికి బడా నేతల అంండదండలు ఉండడం వల్లే ఆఫీసర్లు వెనుకడుగు వేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ ప్రాంతంలో ఎకరం భూమి ప్రస్తుతం రూ. 40 లక్షలు పలుకుతోంది. దీంతో ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన మరికొంత భూమిని కూడా పట్టా చేసుకునేందుకు ఓ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రయత్నం చేస్తున్నట్లు  తెలుస్తోంది. ఇప్పటికైనా ఆఫీసర్లు స్పందించి ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూములను స్వాధీనం చేసుకోవాలని రైతులు కోరుతున్నారు. 

చర్యలు తీసుకుంటాం 

ప్రాజెక్ట్ భూములను కొందరు వ్యక్తులు అక్రమంగా పట్టా చేసుకున్నట్లు మా దృష్టికి వచ్చింది. రెవెన్యూ ఆఫీసర్ల నుంచి వివరాలు సేకరిస్తున్నాం. భూములను త్వరలోనే స్వాధీనం చేసుకుంటాం.
- రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు, ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీఈ, సూర్యాపేట