ఉప్పొంగుతోన్న మూసీ.. ఏడు గేట్లు ఎత్తివేత

భారీ వర్షాలతో  నల్లగొండ జిల్లా కేతపల్లి మండలం దగ్గర మూసీ నది ఉప్పొంగుతోంది.దీంతో మూసీ ఒడ్డున  ఉన్న చిన్న ఆలయాలు వరదలో మునిగిపోయాయి. పూర్తి స్థాయి సామర్థ్యం 645 అడుగులు కాగా.. ప్రస్తుత సామర్థ్యం 642 అడుగులుగా ఉంది. దీంతో ఏడు గేట్లను నాలుగు ఫీట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.  

దోబీ ఘాట్ ను బంద్ చేశారు. రెండు రోజులుగా మూసీ నదిలో వరద ప్రవాహం పెరుగుతోందన్నారు స్థానికులు. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో మూసీ పరివాహక ప్రాంతాల్లోని పబ్లిక్ లో టెన్షన్ నెలకొంది. ఇప్పటికే మూసీ రివర్ పరివాహక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు అధికారులు. ముంపు ప్రాంత వాసులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.