తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన మూసీ రివర్ బెడ్ బాధితులు

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన మూసీ రివర్ బెడ్ బాధితులు

హైదరాబాద్: మూసీ రివర్ ప్రాజెక్ట్ బాధితులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తమ ఇళ్లపై అధికారులు మార్కింగ్ చేయడంతో తీవ్ర ఆందోళనకు గురైన బాధితులు.. ప్రభుత్వం తమ ఇళ్లను కూలగొట్టే అవకాశం ఉందని హైకోర్టు మెట్లు ఎక్కారు. దశాబ్దాలుగా ఇక్కడే నివాసం ఉంటున్నామని.. తమ ఇళ్లను కూలగొట్టకుండా ప్రభుత్వానికి మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని బాధితులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. మూసీ బాధితుల పిటిషన్లపై 2024, అక్టోబర్ 15వ తేదీన హైకోర్టులో విచారణ జరగనుంది.

 కాగా, మురికి కూపంతో నిండిపోయిన మూసీ రివర్‎ను ప్రక్షాళన చేసి సుందరీకరించాలని కాంగ్రెస్ సర్కార్ డిసైడ్ అయ్యింది. ఈ మేరకు మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో ప్రాజెక్ట్ చేపట్టనుంది. ఇందులో భాగంగానే మూసీ ప్రాంతంలో అధికారులు సర్వే చేసి..  పరివాహక ప్రాంతంలోని ఇండ్లపై మార్కింగ్ చేశారు. దీంతో ఆందోళనకు గురైన బాధితులు తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. 

అయితే, మూసీ నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. మూసీ బాధితులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భరోసా కల్పించారు. అయినప్పటికీ మూసీ బాధితులు హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం. ఎవరూ అడ్డొచ్చిన మూసీ ప్రాజెక్ట్ పూర్తి తీసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.