ఎదుటివారు ఎంత బలవంతులైనా ఎదిరించి పోరాడి విజయం సాధించిన మన దేశ రాజుల్లో ఛత్రపతి శివాజీ ఎప్పుడూ టాప్ లోనే ఉంటారు. ఆ గొప్ప వారసత్వాన్ని మహారాష్ట్ర లీడర్లు అచ్చం కొనసాగిస్తున్నారు. ఢిల్లీ పవర్ ఫుల్ పాలిటిక్స్ లో పావులుగా మారకుండా,జాతీయ రాజకీయ పెద్దల బెదిరిం పులకు జడుసుకోకుండా నిలిచి గెలిచి చూపిస్తున్నారు. వారిలో ముఖ్యమైన లీడర్ శరద్ పవార్ . 40 ఏళ్ల కిందట ఇందిరాగాంధీని, 20
ఏళ్ల క్రితం సోనియాగాంధీని సైతం లెక్కచేయకుండా కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి తన పవర్ చూపారు. ఇప్పుడు మరోసారి అదే పె ద్దన్న పాత్ర పోషిస్తూ అందర్నీ ఆకర్షిస్తున్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ని రెండుగా చీల్చుతూ శరద్ పవార్ అన్న కొడుకు అజిత్ పవార్ బీజేపీ అండతో రాత్రికి రాత్రే డిప్యూటీ సీఎం అయిపోయారు. పెద్దాయనకు వెన్నుపోటు పొడిచారనే చెడ్డ పేరు అజిత్ కి వచ్చినా శరద్ పవార్ కుటుంబ సభ్యులు కానీ, ఎన్సీపీ లీడర్లు గానీ అతణ్ని పర్సనల్ గా పల్లెత్తు మాటైనా అనకపోవటం విశేషం. దీన్ని బట్టి శరద్ పవార్ కు తన ఫ్యామిలీ
పైన, పార్టీ పైన ఎంత పట్టుందో అర్థం చేసుకోవచ్చు. కుటుంబం విడిపోకూడదనే ఆదర్శవంతమైన ఆలోచనా విధానమూ ఇందులో కనిపిస్తోంది.
బాబాయే అజిత్ కి బాస్
అటువైపు అజిత్ పవార్ కూడా తన చిన్నాన్నపై విమర్శలు చేయకపోవటం శరద్ పవార్ పెద్దరికానికి దక్కి న గౌరవం. ‘బాబాయి ఎప్పుడూ నా బాసే’ అని ఆ అబ్బాయి వినయ విధేయతలతో ప్రకటించటం ప్రతిఒక్కరి మనసునూ తాకింది. తాను ఎంత కరుడుగట్టిన పొలిటీషియన్ ని అయినా తనదీ ఫ్యామిలీ సెంటిమెంట్ కి కరిగిపోయే మనస్తత్వమేనని శరద్ పవార్ ప్రేమగా అనిపించుకున్నా రు. తిరిగి వచ్చిన అన్న కొడుకుని అక్కున చేర్చుకున్నారు.
అన్ని పార్టీల్లోనూ ఆయన శిష్యులు
‘ప్రజల కోసమే ప్రభువు’ అనే సూత్రాన్ని ఛత్రపతి శివాజీ పాటించి చూపారు. 40 ఏళ్లకుపైగా రాజకీయాల్లో ఉన్న ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ జీవితం కూడా సరిగ్గా ఆ మార్గంలోనే సాగుతోందని ఆయన అభిమానులు అంటుంటారు. కింది నుంచి వచ్చిన నాయకుడిగా ఆయనకు ఈ మంచి పేరు, పబ్లిక్ తో సంబంధాలు నేటికీ కొనసాగుతున్నా యి. శరద్ జీకి అన్ని పార్టీల్లోనూ, సొసైటీలోని అన్ని వర్గాల్లోనూ ఫ్రెండ్స్ ఉన్నారు.ఫీల్డ్ లెవల్ మీటింగ్ పెట్టినప్పుడు పార్టీ పరిస్థితితో పాటు కార్యకర్తల, నాయకుల ఫ్యామిలీ బాగోగులను కూడా అడిగి తెలుసుకుంటూ ఉంటారట. దాదాపుఅన్ని పార్టీల్లో ఆయనకు శిష్యులు ఉన్నా రు.
క్లీన్ ఇమేజ్ పవార్
శరద్ పవార్ కి క్లోజ్ గా ఉండే అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్ బల్ తదితర లీడర్లు కొన్ని స్కామ్ ల్లో నిం దితులుగా ఉన్నా ఆయన మాత్రం క్లీన్ ఇమేజ్ ని సొంతం చేసుకోవటం విశేషం. 1978లో ఇందిరాగాంధీని, 1999లో సోనియాగాంధీని ఎదిరించినా అదే కాంగ్రెస్ పార్టీకి మిత్రుడిగా దగ్గరకావటం, మాటనెగ్గించుకోవటం ఆయనకే చెల్లింది.