సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేయాలి : జిల్లా ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి

ఆర్మూర్, వెలుగు : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని భారతీయ జనత యువ మోర్చా జిల్లా ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆర్మూర్ మండలం అంకాపూర్ లో ఆర్మూర్ నియోజకవర్గ బీజేపీ మండలాధ్యక్షులు, సోషల్ మీడియా, ఐటీ కన్వీనర్ల తో మీటింగ్ నిర్వహించారు.

రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. మీటింగ్ లో బీజేపీ ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు పైడి రాకేశ్​రెడ్డి, బీజేపీ ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు, విఫుల్ రావు, మందుల బాలు పాల్గొన్నారు.