Pushpa2TheRule: మరో 75 రోజులు.. పుష్ప- 2 కొత్త పోస్టర్ రిలీజ్

Pushpa2TheRule: మరో 75 రోజులు.. పుష్ప- 2 కొత్త పోస్టర్ రిలీజ్

అల్లు వారసుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సీక్వెల్ "పుష్ప 2: ది రూల్" చిత్రం ఈ ఏడాది చివరన కానున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ థియోటర్లలోకి రానుంది.

అందుకు మరో 75 రోజుల సమయముండగా.. ఆ గడువును తెలుపుతూ మేకర్స్ తాజాగా కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.ప్ర‌స్తుతం క్లైమాక్స్ షూటింగ్ జ‌రుపుకుంటుంది ఈ చిత్రం. ఇక క్లైమాక్స్ అనంత‌రం శ‌ర‌వేగంగా పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ ప‌నులు స్టార్ట్ చేయ‌బోతున్న‌ట్లు తెలిపింది. ఈ పోస్టర్ లో పుష్ప రాజ్ ఓ మాదిరిగా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాడు. 

పుష్ప పార్ట్ -1 సక్సెస్ కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అందునా పార్ట్-1కు వచ్చిన క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకొని సుకుమార్ చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు. అందువల్లే, ఈ చిత్రం షూటింగ్ చాలా నెమ్మదిగా సాగుతోంది.

ALSO READ | HariHaraVeeraMallu: హరిహర వీరమల్లు షూటింగ్లో పవన్ కళ్యాణ్..రిలీజ్ డేట్ అనౌన్స్

తొలుత ఈ మూవీ ఆగష్టు 15న థియోటర్లలోకి రానుందని ప్రకటించినప్పటికీ.. అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తికాకపోవడంతో వాయిదా వేశారు. అప్పటినుంచి మేకర్స్ ఎప్పటికప్పుడు మూవీకి సంబంధించిన అప్‌డేట్లను ఒక్కొక్కటిగా అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు.

రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.