మునగాకు.. ఈ పేరు చాలా మందికి తెలుసు.. సాంబారులో మునగకాయలు వేస్తే ఆ టేస్టే వేరు. ఇక మునగాకులో ఉండే పోషకాలు అన్నీ.. ఇన్నీ కావు...పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తో తయారు చేసిన వంటకాన్ని ఆరగిస్తే ఆ రోజుంతా ఉత్సాహంగా.. చలాకీగా గడుతుపుతారు. అయితే మునగాకుతో బ్రేక్ ఫాస్ట్ ఏం చేయాలనుకుంటున్నారా.. అదేనండి.. మునగాకు చపాతీ.. ఇది తింటే.. పోషకాలతో పాటు టేస్ట్ అదుర్స్ అంటున్నారు. ఇప్పుడు మునగాకు చపాతీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..
హైటెక్ యుగం.. కంప్యూటర్ యుగం.. జనాలు పొద్దున్నే లేస్తూ ఎందుకొచ్చిందిరా .. జీవితం అంటూ నిస్సహాయంగా నిస్సత్తువుగా లేస్తున్నారు. ఎందుకంటే మనం తినే తిండిలో పోషకాలు లేకపోవడమే వైద్య నిపుణులు చెబుతున్నారు. చాలా మంది మార్నింగ్ ఏదో ఒకటి బ్రేక్ ఫాస్ట్ తినడం.. చకా చకా ఆఫీసులకు.. కాలేజీలకు వెళ్తుంటారు. అయితే పొద్దున్నే తినే అల్పాహారంలో పోషకాలు... మంచి రుచి ఉంటే అలాంటి సమస్యలు ఉండకుండా రోజంతా ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఉంటారని అనేక అధ్యయనాల్లో వైద్య నిపుణులు పేర్కొన్నారు.
బ్రేక్ ఫాస్ట్‌లో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటే రోజంతా ఉత్సాహంగా సాగుతుంది. మోరింగా చపాతి .... అంటే మునగాకులతో చేసే చపాతీ. .. మునగాకులను మోరింగా అంటారు. వీటితో చేసే చపాతీలు చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాదు.. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి.మునగాకు చపాతీలు చేయడం చాలా సులువు. మునగాకులను తినమని వైద్యులు కూడా సిఫారసు చేస్తారు. కాబట్టి మునగాకులు తింటే ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. బ్రేక్ ఫాస్ట్‌లో అధిక పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే ఆరోజంతా చాలా ఉత్సాహంగా పనిచేయగలుగుతారు.
మునగాకు చపాతి రెసిపీకి కావలసిన పదార్థాలు
- గోధుమపిండి - ఒకటిన్నర కప్పు
- మునగాకులు - ముప్పావు కప్పు
- కొత్తిమీర తరుగు - అర కప్పు
- ఉల్లిపాయలు - రెండు
- పచ్చిమిర్చి - ఒకటి
- వెల్లుల్లి తరుగు - అర స్పూను
- అల్లం తరుగు - అర స్పూను
- కారం - అర స్పూను
- పసుపు - పావు స్పూను
- యాలకుల పొడి - పావు స్పూను
- చాట్ మసాలా - పావు స్పూను
- ఉప్పు - రుచికి సరిపడా
- నీరు - తగినంత
- నెయ్యి - ఒక స్పూను
మునగాకు చపాతి రెసిపీ
- మునగాకు చపాతీ చేయడానికి ముందుగా గోధుమ పిండిని తీసుకోండి.
- ఒక గిన్నెలో గోధుమ పిండి తీసుకొని అందులోనే సన్నగా తరిగిన మునగాకులు, ఉల్లి తరుగు, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు వేసి బాగా కలపాలి.
- కారం, పసుపు, యాలకుల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి.
- నీరు వేసి చపాతీ పిండి లాగా కలుపుకోండి.
- ఆ పిండిని గాలి తగలకుండా మూత పెట్టి పావుగంట సేపు పక్కన పెట్టండి.
- ఇప్పుడు చిన్న భాగాన్ని తీసుకొని చపాతీలా ఒత్తుకోండి.
- స్టవ్ మీద పెనం పెట్టి నెయ్యి రాయండి.
- నెయ్యి వేడెక్కాక ఈ చపాతీని దానిపై వేసి రెండు వైపులా కాల్చుకోండి.
- దీన్ని ఏ కూరతో తిన్నా టేస్టీగా ఉంటుంది. రుచి కూడా అదిరిపోతుంది.
మునగాకులను మన ఆహారంలో భాగం చేసుకోమని వైద్యులు కూడా చెబుతున్నారు. మునగ ఆకుల్లో మన ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా క్యాల్షియం, పొటాషియం, ఐరన్ దీని నుండి అధికంగా లభిస్తాయి. అంతేకాదు మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాల నుంచి ఇది రక్షణ కల్పిస్తుంది. అధిక రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు ఉన్నవారు మునగాకులతో చేసిన ఆహారాన్ని ప్రతిరోజూ తింటే అవి అదుపులో ఉంటాయి. ఇక బ్రేక్ ఫాస్ట్ లో మునగాకుతో చేసిన ఆహారాలను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని వైద్యులు చెబుతున్నారు.