ఆధార్​ పీవీసీ కార్డులో ఎన్నో ఫీచర్లు.. రూ.50 చెల్లిస్తే కార్డు ఇంటికే..

ఆధార్​ పీవీసీ కార్డులో ఎన్నో ఫీచర్లు.. రూ.50 చెల్లిస్తే కార్డు ఇంటికే..

లేటెస్ట్​ సెక్యూరిటీ ఫీచర్లతో తీసుకొచ్చిన ఉడాయ్​

న్యూఢిల్లీ: ఆధార్​కార్డును మరింత సులువుగా ఉపయోగించుకునేలా క్రెడిట్​ కార్డు సైజులో పీవీసీ కార్డు రూపంలో దీనిని యూనిక్​ ఐడెంటిఫికేషన్​ అథారిటీ ఆఫ్ ఇండియా (ఉడాయ్​) తీసుకొచ్చింది. పాలివినిల్ ​ క్లోరైడ్​ కార్డు (పీవీసీ కార్డు)ను పర్సులోనే పెట్టుకొని ఎక్కడికి అంటే అక్కడికి తీసుకెళ్లొచ్చు. ఇందులో ఎన్నో సెక్యూరిటీ ఫీచర్ల ఉండటంతోపాటు సాధారణ కార్డుతో పోలిస్తే ఎక్కువ కాలం మన్నుతుంది. వేగంగా వెరిఫై చేసుకోవచ్చు. ఆన్​లైన్​లో రూ.50 చెల్లించి ఆర్డర్​ చేస్తే దాదాపు వారంలోపే పోస్ట్​మ్యాన్​ తెచ్చిస్తాడు.

ఇందులోని ప్రత్యేకతలు:

నాణ్యమైన ప్రింటింగ్, లామినేషన్​ వల్ల ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఎక్కువకాలం మన్నుతుంది.

దీనిపై హోలోగ్రామ్​, గులోచ్​ ప్యాటర్న్​, ఘోస్ట్​ ఇమేజ్​, మైక్రోటెక్ట్స్​ ఉండటం వల్ల డూప్లికేట్​ తయారు చేయడం కష్టం.

ఇది పూర్తిగా వెదర్​ ప్రూఫ్​. అంటే నీరుపడ్డా, దుమ్ము అంటినా ఏమీ కాదు. ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. పాడవుతుందనే బాధ అక్కర్లేదు.

క్యూఆర్​ కోడ్​ కూడా ఉంటుంది కాబట్టి వెంటనే ఆఫ్​లైన్ వెరిఫికేషన్ సాధ్యమవుతుంది.

ఇష్యూ డేట్​, ప్రింట్​ డేట్​ కూడా ఉంటాయి. ఉబ్బి కనిపించేలా ఆధార్​ లోగోను ముద్రించారు. ఆధార్​తో మొబైల్​ నంబర్​ రిజిస్టర్​ కాని వాళ్లు కూడాపీవీసీ కార్డును ఆర్డర్​ చేయవచ్చు.

ఇది వరకే ఆధార్​కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లు ట్రాకింగ్​ కోసం www.uidai.gov.in  లింకును ఓపెన్​ చేసి మై ఆధార్​ ట్యాబ్​పై క్లిక్​ చేయాలి. తిరిగి చెక్​ ఆధార్​ పీవీసీ కార్డ్​ ట్యాబ్​పై క్లిక్​ చేస్తే స్టేటస్​ తెలుస్తుంది.

For More News..

40 ఏళ్లకే బిలినియర్లుగా మనవాళ్లు

దేశాల మధ్య ముదురుతున్న సైబర్ వార్

మహారాష్ట్ర గవర్నర్, సీఎంల మధ్య లెటర్ల యుద్ధం