అవసరమైతే మరిన్ని చెక్​పోస్టులు ఏర్పాటు చేస్తం : సీపీ డీఎస్ చౌహాన్

అవసరమైతే మరిన్ని చెక్​పోస్టులు ఏర్పాటు చేస్తం :  సీపీ డీఎస్ చౌహాన్
  •     రాచకొండ పరిధిలో ఇప్పటి వరకు చేపట్టిన తనిఖీల్లో రూ.40 కోట్లు సీజ్ చేశాం 
  •      సీపీ డీఎస్ చౌహాన్
  •     మాడ్గుల, యాచారంలోని చెక్ పోస్టుల పరిశీలన

ఇబ్రహీంపట్నం, వెలుగు : ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో మరిన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు కొనసాగిస్తామని సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. గురువారం రంగారెడ్డి జిల్లాలోని మాడ్గుల, యాచారం పోలీస్ స్టేషన్లను ఆయన సందర్శించారు. ఇబ్రహీంపట్నంలోని బీడీఎల్ రోడ్,యాచారంలోని మాల్ వద్ద చెక్ పోస్టులను పరిశీలించి వెహికల్ చెకింగ్ చేపట్టారు. సీపీ మాట్లాడుతూ.. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

రాచకొండ పరిధిలో ఏర్పాటు చేసిన 24 చెక్ పోస్టులలో తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. అక్రమంగా తరలిస్తున్న డబ్బును పట్టుకునేందుకు అవసరమైతే మరిన్ని చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.  రాచకొండ పరిధిలో ఇప్పటివరకు చేపట్టిన తనిఖీల్లో రూ.40 కోట్ల క్యాష్​ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు.

పాత నేరస్తులను బైండోవర్ చేస్తున్నామని, మాడ్గుల పరిధిలో 90 మందిని ముందస్తుగా బైండోవర్ చేశామన్నారు. ఆయన వెంట మహేశ్వరం డీసీపీ శ్రీనివాస్, ఇబ్రహీంపట్నం ఏసీపీ కేఎస్ రావు, సీఐలు సైదయ్య, రాజశేఖర్ఉన్నారు.

ALSO READ : నవంబర్3న బీఆర్ఎస్​లోకి కాసాని