ఐపీఓకు మరిన్ని కంపెనీలు.. సెబీకి డాక్యుమెంట్లు అందజేత

ఐపీఓకు మరిన్ని కంపెనీలు..  సెబీకి డాక్యుమెంట్లు అందజేత

న్యూఢిల్లీ: ఐపీఓ కోసం మరిన్ని కంపెనీలు రెడీ అవుతున్నాయి. హైదరాబాద్​కు చెందిన ఆర్డీ ఇంజనీరింగ్​ లిమిటెడ్ ​ఐపీఓ కోసం సెబీకి డాక్యుమెంట్లు అందజేసింది. పబ్లిక్​ఇష్యూ ద్వారా రూ.580 కోట్లు సేకరించనుంది. ఓఎఫ్ఎస్​ ద్వారా ప్రమోటర్ ​మోటూరు చంద్రశేఖర్​షేర్లు అమ్ముతారు. ప్రీ–ఐపీఓ ప్లేస్​మెంట్ ​రౌండ్​ద్వారా రూ.100 కోట్లు సేకరించాలని కంపెనీ భావిస్తోంది. ఈ ప్లేస్​మెంట్​పూర్తయితే ఫ్రెష్​ఇష్యూ సైజు తగ్గుతుంది. 

 స్టడ్స్ యాక్సెసరీస్

టూవీలర్ల హెల్మెట్ల తయారీ సంస్థ స్టడ్స్ యాక్సెసరీస్ లిమిటెడ్ కూడా ఐపీఓ కోసం సెబీకి డాక్యుమెంట్లను అందజేసింది. ఈ పబ్లిక్ ​ఇష్యూ ఫ్రెష్​ఇష్యూ ఉండదు. ఆఫర్ ఫర్ సేల్ విధానంలో 77,86,120 షేర్లను విక్రయించనుంది. 

పేస్ డిజిటెక్

టెలికాం పాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్​ పేస్ డిజిటెక్ లిమిటెడ్ ఐపీఓ ద్వారా రూ. 900 కోట్లు సమీకరించడానికి సెబీ డాక్యుమెంట్లను సమర్పించింది. బెంగళూరుకు చెందిన ఈ కంపెనీ ఐపీఓ పూర్తిగా ఫ్రెష్ ​ఇష్యూ విధానంలో ఉంటుంది. కంపెనీ ప్రీ–ఐపీఓ ప్లేస్‌‌‌‌మెంట్ రౌండ్ ద్వారా రూ. 180 కోట్లు సమీకరించవచ్చు. ఇష్యూ నుంచి వచ్చిన ఆదాయంలో రూ. 630 కోట్లను మూలధన ఖర్చులకు, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాలకు వాడనుంది.