లేఅవుట్లు, పార్కుల కబ్జాలపై ఎక్కువ ఫిర్యాదులు.. యాక్షన్​ తీసుకోవాలని హైడ్రా చీఫ్కు వినతులు

లేఅవుట్లు, పార్కుల కబ్జాలపై ఎక్కువ ఫిర్యాదులు.. యాక్షన్​ తీసుకోవాలని హైడ్రా చీఫ్కు వినతులు

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా ఆఫీసులో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 63 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో లేఅవుట్లలో రోడ్లు, పార్కుల స్థలాల క‌‌‌‌బ్జాల‌‌‌‌పైనే ఎక్కువగా వచ్చాయి. గ‌‌‌‌చ్చిబౌలిలోని స‌‌‌‌ర్వే నంబర్​124, 125లో 20 ఎక‌‌‌‌రాల ప‌‌‌‌రిధిలో ఫెర్టిలైజ‌‌‌‌ర్ కార్పొరేష‌‌‌‌న్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ కాల‌‌‌‌నీ లేఅవుట్ఉందని, ఇక్కడ 162 ప్లాట్లు ఉండగా, రోడ్లు, పార్కుల హ‌‌‌‌ద్దులు చెరిపేసి షెడ్లు, ఇతర నిర్మాణాలు చేపట్టారని కొందరు హైడ్రా చీఫ్​కు ఫిర్యాదు చేశారు. వీటిని కమర్షియల్​అవసరాల కోసం సంధ్యా క‌‌‌‌న్వెన్షన్ య‌‌‌‌జమాని శ్రీ‌‌‌‌ధ‌‌‌‌ర్ రావు వినియోగించుకుంటున్నార‌‌‌‌ని కమిషనర్​దృష్టికి తీసుకువచ్చారు. 

రంగారెడ్డి జిల్లా పోచారం మున్సిపల్​పరిధిలోని దివ్యాన‌‌‌‌గ‌‌‌‌ర్ లేఅవుట్‌‌‌‌లో న‌‌‌‌ల్ల మ‌‌‌‌ల్లారెడ్డి.. అక్కడి రోడ్లు ఆక్రమించి షెడ్లు, నిర్మాణాలు చేప‌‌‌‌ట్టార‌‌‌‌ని కొంత‌‌‌‌మంది ప్లాట్ య‌‌‌‌జ‌‌‌‌మానులు ఫిర్యాదు చేశారు. శేరిలింగంప‌‌‌‌ల్లి మున్సిపల్​ప‌‌‌‌రిధిలోని కొండాపూర్, మ‌‌‌‌సీదుబండ సీఎంసీ ఎన్‌‌‌‌క్లేవ్‌‌‌‌లో ప్రజావ‌‌‌‌స‌‌‌‌రాల‌‌‌‌కు ఉద్దేశించిన స్థలాల‌‌‌‌ను ఆసిఫ్ ప‌‌‌‌టేల్ ఆక్రమించి నిర్మాణాలు చేప‌‌‌‌ట్టార‌‌‌‌ని ఎన్‌‌‌‌క్లేవ్  నివాసితులు ఫిర్యాదు చేశారు. 

శేరిలింగంప‌‌‌‌ల్లి మున్సిపాలిటీలోని తౌతానికుంటలో మ‌‌‌‌ట్టి నింపి  భ‌‌‌‌గీర‌‌‌‌థ‌‌‌‌మ్మ చెరువుకు వెళ్లే వ‌‌‌‌ర‌‌‌‌ద కాలువ‌‌‌‌లు మూసేయ‌‌‌‌డంతో త‌‌‌‌మ నివాస ప్రాంతాల‌‌‌‌ను వ‌‌‌‌ర్షపు నీరు ముంచెత్తుతోంద‌‌‌‌ని గ్రీన్‌‌‌‌గ్రేస్ రెసిడెంట్స్ సొసైటీ ప్రతినిధులు కంప్లయింట్​చేశారు. పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ గ్రామం స‌‌‌‌ర్వే నంబ‌‌‌‌రు 9, 10లోని ప‌‌‌‌ది ఎక‌‌‌‌రాల లే ఔట్‌‌‌‌లో పార్కుకు ఎక‌‌‌‌రం కేటాయించ‌‌‌‌గా, ఇప్పుడు అక్కడ కూడా ప్లాట్లు వేసి అమ్మేస్తున్నార‌‌‌‌ని బాధితులు హైడ్రాను ఆశ్రయించారు. దీంతో గూగుల్ మ్యాప్స్‌‌‌‌, శాటిలైట్ ఇమేజీల‌‌‌‌లో గ‌‌‌‌తంలో ఎలా ఉండేవి?  ఇప్పుడు ఎలా ఉన్నాయని  క‌‌‌‌మిష‌‌‌‌న‌‌‌‌ర్  ప‌‌‌‌రిశీలించారు. ఆ నిర్మాణాల‌‌‌‌కు అనుమ‌‌‌‌తులున్నాయా లేదా ప‌‌‌‌రిశీలించి వెంట‌‌‌‌నే వాటిని తొల‌‌‌‌గించాల‌‌‌‌ని అధికారుల‌‌‌‌ను  ఆదేశించారు.

జీహెచ్ఎంసీకి 180  ఫిర్యాదులు

 జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 67  ఫిర్యాదులు వచ్చాయి. ప్రజల నుంచి అడిషనల్ కమిషనర్  శివకుమార్ నాయుడు ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో  టౌన్ ప్లానింగ్ విభాగానికి33, ట్యాక్స్ సెక్షన్ 9, ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ విభాగాలకు 3 చొప్పున, అడ్మిన్, శానిటేషన్, ఫైనాన్స్ విభాగాలకు రెండు చొప్పున, హెల్త్, విజిలెన్స్, లెక్షన్, యుబీడీ, లేక్స్, వెటర్నరీ విభాగాలకు ఒక్కటి చొప్పున ఫిర్యాదులు అందాయి. 

ఫోన్ ఇన్ ద్వారా 7  ఫిర్యాదులు వచ్చాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో మొత్తం 113 ఫిర్యాదులు వచ్చాయి. అందులో కూకట్ పల్లి జోన్ లో 42, శేరిలింగంపల్లి జోన్ లో 12, ఎల్బీనగర్ 11, సికింద్రాబాద్ జోన్ లో 40, చార్మినార్ జోన్ లో 5,   ఖైరతాబాద్ జోన్ లో మూడు ఫిర్యాదులు అందాయి.

రంగారెడ్డి కలెక్టరేట్: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలని రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం రంగారెడ్డి కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 51 ఫిర్యాదులు వచ్చాయి. వాటిని వెంటనే సంబంధిత అధికారులు పరిశీలించి, పరిష్కరించాలని సూచించారు.

ఫ్రీగా స్థలం ఇస్తాం హైడ్రా పీఎస్ ఏర్పాటు చేయండి

దివ్యాన‌‌‌‌గ‌‌‌‌ర్ లే అవుట్‌‌‌‌లో హైడ్రా పోలీసు స్టేష‌‌‌‌న్ ఏర్పాటు చేయాల‌‌‌‌ని, ఇందుకు అవ‌‌‌‌స‌‌‌‌ర‌‌‌‌మైన స్థలాన్ని తాము ఇస్తామని అక్కడి భూ య‌‌‌‌జ‌‌‌‌మానులు హ‌‌‌‌నుమంత‌‌‌‌రెడ్డి, జైపాల్‌‌‌‌రెడ్డితో పాటు  ప‌‌‌‌లువురు క‌‌‌‌మిష‌‌‌‌న‌‌‌‌ర్‌‌‌‌కు విన‌‌‌‌తిప‌‌‌‌త్రం అంద‌‌‌‌జేశారు. ఫీర్జాదిగూడ పరిధిలోని 200 ఎక‌‌‌‌రాల దివ్యాన‌‌‌‌గ‌‌‌‌ర్ లేఅవుట్ చుట్టూ ఉన్న ప్రహ‌‌‌‌రీని తొల‌‌‌‌గించి, రోడ్లను క్లియర్ చేసిన హైడ్రాకు స్థానికులు ధ‌‌‌‌న్యావాదాలు తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కడ పీఎస్​ ఏర్పాటు చేయాలని కోరారు.