Cyber Crime: రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. పెట్టుబడుల పేరుతో కోట్లు కోట్టేశారు

హైదరాబాద్ లో సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. మాయమాటలనే పెట్టుబడిగా పెట్టి సైబర్ చీటింగ్స్ కు పాల్పడుతున్నారు మోసగాళ్లు. ఎంత జాగ్రత్తగా ఉన్నామని అనుకున్నా.. వారి బుట్టలో పడకుండా జనం ఉండలేకపోతున్నారు. అమాయకుల నుండి పెట్టుబడుల పేరుతో కోట్లు కొల్లగొడుతున్నారు. వారం రోజుల వ్యవధిలో హైదరాబాద్ నగరవాసుల నుండి రూ. 2 కోట్ల వరకు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. 

తాజాగా టెలిగ్రామ్, వాట్సాప్ యాప్ ల ద్వారా పరిచయం పెంచుకుని ఆన్ లైన్ బిజినెస్ లలో పెట్టుబడుల పేరుతో ముగ్గురిని ట్రాప్ చేశారు చీటర్స్. ముగ్గురు బాధితులు.. ఒకరి నుండి రూ.22 లక్షలు, మరొకరి నుండి రూ.15 లక్షలు, ఇంకొకరు నుండి రూ.11 లక్షల చొప్పున మొత్తం 48 లక్షలు కాజేశారు. బాధితులు వేరువేరుగా సిటీ సైబర్ క్రైమ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.