
ఏప్రిల్ 16 సాయంత్రం అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా ఉగ్రరూపందాల్చింది. నల్లటి మేఘాలు ప్రతాపం చూపుతున్న సూర్యుడికి అడ్డొచ్చా యి. అది మొదలు పెళపెళమంటూ ఉరుములు, అంతెత్తు లేచిన దుమ్ము, జోరువర్షం నార్త్ ఇండియాను అతలాకుతలం చేసింది.మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ , గుజరాత్, రాజస్థాన్‌లో 41వేల పిడుగులు వందల మంది ప్రాణాలు తీశాయి. అసలీ అకాల ప్రళయం ఇండియాపై ఎందుకు విరుచుకుపడిందో తెలుసా? దీనికి సమాధానం వెస్టర్న్ డిస్టర్బెన్స్(డబ్ల్ డి). అంటే పశ్చిమం నుంచి వీచే చల్లటి కల్లోల గాలులు. వాయువ్య భారతంలోని వేడి గాలులతో కలిసి స్థానికంగా ప్రళయాన్ని సృష్టించాయి.
వాస్తవానికి జనవరి నెల నుంచీ డబ్ల్యూడీ వల్ల ఇండియాలో అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి.ఇవి బలమైనవి కాకపోవడం వల్ల అంతగా నష్టం కలిగించలేదు. కానీ ఏప్రిల్ 16న కురిసి న వర్షాలపై డబ్ల్యూడీ ప్రభావం తీవ్రమైనది కాదు. పశ్చిమ రాజస్థాన్ లో అప్పటికే తుఫాన్ వచ్చే పరిస్థితులున్నాయి. ఇదే సమయానికి డబ్ల్యూడీ గాలుల ప్రభావం పెరగడంతో గాలి వానలు కురిశాయి. మేఘాలు ఢీ కొట్టుకుని వేల సంఖ్యలో పిడుగులు పడ్డాయని పుణేలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటిరియాలజీ(ఐఐటీ-ఎమ్) తెలిపింది. ఏప్రిల్‌లో కురిసిన అకాల వర్షాల కారణంగా 11 రాష్ట్రాల్లో 89 మంది చనిపోయారు.ఒక్క ఏప్రిల్ 16వ తేదీన రాజస్థాన్ లోనే 25 మంది, రెండ్రోజుల్లో మధ్యప్రదేశ్ లో 16 మంది ప్రాణాలుకోల్పోయారు.
అప్పట్లో ఆంధ్రప్రదేశ్ పైనా..
2018 మే నెలలో ఆంధ్రప్రదేశ్ లో ఒక్కరోజే 41వేల పిడుగులు పడ్డాయి. వీటి ధాటికి 14 మందిచనిపోయారు. పిడుగుల గురించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ మొబైల్ ఫోన్లకు ముందస్తుగా మెసేజ్ లు పంపడంతో చాలా మందిప్రాణాలు కాపాడుకున్నారు. మధ్య దరా సముద్ర ప్రాంతంలో ఏర్పడే చల్లని గాలులనే వెస్టర్న్ డిస్టర్బెన్స్ గా పిలుస్తారు. తక్కువ పీడనం వల్ల పశ్చిమాన ఏర్పడే ఈ గాలులు ఎక్కు వ పీడనం కలిగిన వేడిగాలులున్నభారత ఉపఖండం వైపుకు వీస్తాయి. వెస్టర్న్ డిస్టర్బెన్స్ ప్రభావం వల్ల భారీ వర్షాలు, మంచు, పొగమంచు కురుస్తాయి.
అధిక మరణాలు పిడుగుల వల్లే..
ఇండియాలో వరదలు, వడగాలులు, చలిగాలుల కంటే ఎక్కు వ ప్రాణ నష్టం పిడుగు పాటువల్లే జరుగుతోంది. అయినా ఈ ప్రమాదంపై ప్రభుత్వం పెద్దగా ఫోకస్ చేయడం లేదు.2018లో దాదాపు 3 వేల మంది పిడుగుల ధాటికి బలయ్యారు. గత మూడేళ్లలో పిడుగుల వల్ల చనిపోయే వాళ్ల సంఖ్య వెయ్యి కి పైగా పెరిగిందని క్లైమేట్ రీసైలెంట్ అబ్జర్వింగ్ సిస్టమ్స్ ప్రొమోషన్ కౌన్సిల్(సీఆర్వోపీసీ) పేర్కొంది.వాతావరణ మార్పుల వల్ల తరచూ తుఫానులు ఏర్పడుతున్నాయని చెప్పింది. దీని ఫలితంగానే పిడుగుపాటు పెరుగుతోందని వెల్లడించింది.