మాస్కులతో మస్తు రోగాలు మాయం

ఇట్లే వాడితే ప్రమాదకర వైరస్‌లు, బ్యాక్టీరియాలు ఖతం
రకరకాల అలర్జీలూ తగ్గిపోతయ్‌
స్పష్టం చేస్తున్న డాక్టర్లు, ఎపిడమాలజిస్టులు

నల్గొండ, వెలుగు: కరోనా కాలంలో మనం వాడుతున్న మాస్కులను ఇలాగే వాడుతూ పోతే క్రమంగా టీబీ మాయమైపోతదట. అంటువ్యాధులు, సీజనల్‌‌‌‌‌‌‌‌రోగాలు పత్తాలేకుండా పోతాయట. రకరకాల అలర్జీలూ కనుమరుగవుతాయట. సీనియర్‌ ‌‌‌‌‌‌‌డాక్టర్లు, ఎపిడమాలజిస్టులు చాలామంది ఇదే విషయం చెబుతున్నారు. ముక్కు, నోటి ద్వారా వ్యాపించే ప్రమాదకర బ్యాక్టీరియాలు, వైరస్‌‌‌‌‌‌‌‌లు అంతరించిపోతాయంటున్నారు.

సోకే చాన్స్‌‌‌‌‌‌‌‌ తగ్గింది
ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే అంటువ్యాధుల్లో టీబీ ముఖ్యమైంది. కరోనాలాగే తుమ్మడం, దగ్గడం, తుంపర్ల ద్వారా టీబీ వ్యాపిస్తుంది. కొవిడ్‌‌‌‌‌‌‌‌కు వైరస్ కారణమైతే బ్యాక్టిరీయా వల్ల టీబీ వస్తుంది. ప్రస్తుతం బ్యాక్టిరీయాను కంట్రోల్ చేసే మందులు ఉండటంతో టీబీ వల్ల ప్రమాదం లేదు. కానీ వైరస్‌‌‌‌‌‌‌‌లను నివారించేందుకు మందుల్లేవు. అందుకే కరోనాతో ప్రాణనష్టం జరుగుతోంది. అయితే జనమంతా 3 నెలలుగా మాస్కులు
వాడుతుండటం, ఫిజికల్‌‌‌‌‌‌‌‌ డిస్టెన్స్‌‌ ‌‌‌‌‌‌పాటిస్తుండటంతో వ్యాధులు సోకిన వారి నుంచి వేరే వాళ్లకు వ్యాపించే చాన్స్‌ ‌‌‌‌‌‌‌తగ్గిపోతోందని, దీంతో రోగాల రేటు పడిపోయిందని ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్స్ చెబుతున్నారు. గతంలో ఈ టైమ్‌‌‌‌‌‌‌‌కు డెంగీ, మలేరియా, చికున్ గున్యా, వైరల్ ఫీవర్స్ వ్యాప్తి ఎక్కువగా ఉందని.. ఈసారి మాస్కుల వాడకం వల్ల వ్యాప్తి తగ్గిందని అంటున్నారు.

రెండు నెలల్లో క్లారిటీ
మార్చి నెలాఖరు నుంచి జిల్లాల్లో ‘డిస్ట్రిక్ట్ టీబీ కంట్రోల్ బోర్డు’ ద్వారా టీబీ రోగుల లెక్కలను ప్రభుత్వం సేకరిస్తోంది. టీబీ పేషెంట్లలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్తగా నెల అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌గానే మందులు అందజేస్తోంది. కొత్తగా నమోదవుతున్న కేసుల పైనా దృష్టిపెడుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి జులై 15 వరకు నమోదైన కేసులను పరిశీలిస్తే కొంతమేర తగ్గుముఖం పట్టాయని టీబీ సర్వే చేస్తున్న ఆఫీసర్లు చెబుతున్నారు. గతేడాది ఈ టైమ్‌లో నల్గొండ జిల్లాలో 1,800 కేసులు నమోదైతే ఈసారి ఇప్పటి వరకు 1,655 కేసులు నమోదయ్యాయి. దీనితో పాటు ఈ ఏడాది వైరల్ ఫీవర్స్ కూడా బాగా తగ్గాయని, వీటికి మాస్కుల వాడకమే కారణమని ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్స్ అంటున్నారు. మరో రెండు, మూడు నెలలు గడిచాకే ఈ విషయంలో ఓ స్పష్టమైన అంచనాకు రావొచ్చంటున్నారు.

ఈసారి వైరల్ ఫీవర్స్ లేవు
గతేడాది ఈ టైమ్‌లో డెంగీ, మలేరియా, చికున్ గున్యా, వైరల్ ఫీవర్స్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. కానీ ఈసారి 3 నెలల నుంచి మాస్కులు పెట్టుకోవడం, ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తుండటం, ఇండ్లను శుభ్రంగా పెట్టుకుంటుండటంతో అంతగా లేవు.

అంటువ్యాధులు రావు
మాస్కుల వాడకం కంటిన్యూ చేస్తే అంటువ్యాధులు, వైరల్ ఫీవర్స్ రావు. టీబీ లాంటి రోగాలు అంతరిస్తాయి. కేంద్రం డేటా ప్రకారం ప్రతి లక్ష మందిలో 211 మంది టీబీ వ్యాధిగ్రస్తులున్నారు. నల్గొండ జిల్లాలో 17 లక్షల జనాభా ఉండగా 3,627 కేసులను గుర్తించాలని కేంద్రం టార్గెట్ పెట్టింది. ఇప్పటి వరకు 1,655 కేసులను గుర్తించాం. -కల్యాణ చక్రవర్తి, టీబీ కంట్రోల్ అధికారి, నల్గొండ జిల్లా

For More News..

కరోనా పాజిటివ్ మహిళకు 108లో ప్రసవం