చైనా మాల్‌ తగ్గించేందుకు కొత్త ప్లాన్

చైనా మాల్‌ తగ్గించేందుకు కొత్త ప్లాన్

అత్యధిక టారిఫ్‌‌లు విధించాలని ప్లాన్
క్వాలిటీ కంట్రోల్ చర్యలు కఠినం
370 ప్రొడక్ట్‌‌లను లిస్ట్ చేసిన కేంద్రం

న్యూఢిల్లీ: చైనా దిగుమతులపై ఇండియా మరింత కఠినంగా వ్యవహరించాలని ప్లాన్ చేస్తోంది. డ్రాగన్ నుంచి వచ్చే వస్తువులపై అత్యధిక టారిఫ్‌‌లు, క్వాలిటీ కంట్రోల్ విషయంలో కఠినమైన చర్యలు తీసుకోవాలనుకుంటోందని ఈ విషయం తెలిసిన వ్యక్తులు చెప్పారు. సరిహద్దులో ఇరు దేశాల మధ్య నెలకొన్న టెన్షన్లతో ఆర్థిక సంబంధాలు ప్రమాదంలో పడ్డాయి. ప్రభుత్వ రంగ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌‌ సుమారు 370 ప్రొడక్ట్‌‌లపై కఠినతరమైన నిబంధనలు తీసుకురావాలని నిర్ణయించిందని, వీటిని లోకల్‌‌గానే ఉత్పత్తి చేస్తూ.. అసలు దిగుమతి చేసుకోకూడదని భావిస్తోందని తెలుస్తోంది. ఈ ప్రొడక్ట్‌‌లలో కెమికల్స్, స్టీల్, ఎలక్ట్రానిక్స్, హెవీ మెషినరీ, ఫర్నిచర్, పేపర్, ఇండస్ట్రియల్ మెషినరీ, రబ్బర్ ఆర్టికల్స్, గ్లాస్, మెటల్ ఆర్టికల్స్, ఫార్మా, ఫెర్టిలైజర్, ప్లాస్టిక్ టాయ్స్ వంటివి ఉన్నాయి. ఫర్నిచర్, ఏసీల్లో వాడే కంప్రెషర్స్, ఆటో కాంపోనెంట్లపై దిగుమతి సుంకాన్ని పెంచే ప్రతిపాదనపై కూడా చర్చలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ప్రతిపాదనలను ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందని, లోకల్ మాన్యుఫాక్చరింగ్‌‌ను ప్రమోట్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొన్నాయి. మరోవైపు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రూల్స్‌‌ను అతిక్రమించకుండా చైనీస్ దిగుమతులకు చెక్ పెట్టేందుకు నాన్ టారిఫ్ చర్యలను కూడా ట్రేడ్ మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. ఈ చర్యల్లో ప్రొడక్ట్‌‌లను మరింత తనిఖీ, ప్రొడక్ట్ టెస్టింగ్, క్వాలిటీ సర్టిఫికేషన్ రిక్వైర్‌‌‌‌మెంట్‌‌ను తీసుకురావాలని భావిస్తోంది. ఈ విషయంపై స్పందించేందుకు ట్రేడ్ మినిస్ట్రీ అధికార ప్రతినిధి నిరాకరించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి కూడా స్పందించడం లేదు. దిగుమతులకు చైనా అతిపెద్ద సోర్స్‌‌గా ఉంది. ఎలక్ట్రానిక్ గూడ్స్ నుంచి ఇండస్ట్రియల్ మిషనరీ, ఆర్గానిక్ కెమికల్స్ వరకు అన్నింటిని చైనా నుంచి కొంటున్నారు. మన దేశంతో చైనాకు 50 బిలియన్ డాలర్ల ట్రేడ్ సర్‌‌‌‌ప్లస్ ఉంది.

For More News..

ఫిక్సింగ్‌‌‌‌ను ఇండియాలో క్రైమ్‌‌‌‌గా చూడాలి

కరోనా ఎఫెక్ట్: కన్నవాళ్లు చనిపోయినా శవాన్ని ఇంటికి తీసుకెళ్లలేని పిల్లలు

రాష్ట్రంలో కరోనా టెస్టులకు బ్రేక్