హైదరాబాద్, వెలుగు: హోమ్ ఫర్నిచర్‌ను అమ్మే గోద్రెజ్ ఇంటీరియో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో తమ షోరూమ్‌లను భారీగా పెంచుకుంటామని ప్రకటించింది. రానున్న మూడేళ్లలో 25 కొత్త షోరూమ్‌లను, 150 రిటైల్ ఔట్లెట్లను ఓపెన్ చేసే ప్లాన్‌లో ఉంది. ఒక్క తెలంగాణలో కంపెనీకి 14 షోరూమ్‌లు, 55 డీలర్లు, 25 రిటైల్ ఔట్లెట్లు ఉన్నాయి. పండగ సీజన్ ప్రారంభం అవ్వడంతో కంపెనీ కొత్త ఆఫర్లను ప్రకటించింది. రూ.8 లక్షల కంటే ఎక్కువ కొనుగోళ్లు జరిపే వారికి 35 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది.
అలానే అన్ని కొనుగోళ్లపై ఒక స్క్రాచ్ కార్డును ఇస్తోంది. ఈ స్క్రాచ్ కార్డ్‌తో 4 శాతం నుంచి 100 శాతం వరకు అస్యూర్డ్ డిస్కౌంట్ పొందే వీలుందని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ దేవ్ సర్కార్ అన్నారు. కిందటేడాది 20–25 శాతం గ్రోత్ నమోదు చేశామని పేర్కొన్నారు. రూ.3,200 కోట్ల టర్నోవర్ సాధించామని తెలిపారు. ఇందులో సౌత్ ఇండియా వాటా కేవలం రూ.180 కోట్లుందని, దీనిని పెంచాలని టార్గెట్ పెట్టుకున్నామని తెలిపారు.