Good Health:రోజుకు రెండు తింటే దిమ్మతిరిగే లాభాలు.. అవి ఏంటంటే..

వంటిల్లు హాస్పిటల్ తో సమానం అంటారు పెద్దలు. అవును మరి... చాలా రకాల ఆరోగ్య సమస్యలకు వంటింట్లోనే మెడిసిన్ దొరుకుతుంది.లవంగాలు ప్రతి ఇంట్లోనూ ఖచ్చితంగా ఉండే మసాలా దినుసు .మంచి రుచి, వాసన మాత్రమే కాదు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి లవంగాలు. ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే అనేక రోగాల బారి నుండి లవంగాలు మనలను కాపాడతాయి. అసలు లవంగాలు ఎన్ని రకాలుగా పనిచేస్తాయి? ఎన్ని అనారోగ్య సమస్యల నుంచి మనకు ఉపశమనం కలిగిస్తాయి? అలాంటి వాటిలో వంటింట్లో దొరికే లవంగంతో ఆరో గ్యానికి ఎలాంటి లాభాలో చూద్దామా!

నోటి ఆరోగ్యానికి..లవంగాలు నోటి ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల నోటి పూతలు, దంతాల వాపు, చిగురువాపు వంటి చిగుళ్ల సంబంధిత సమస్యల పరిష్కారానికి లవంగ నూనె సాయపడుతుంది.
సహజంగా రక్తశుద్ధి..లవంగాలు బ్లడ్‌ని ప్యూరిఫై చేస్తాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్, మన రక్తాన్ని క్లీన్, హెల్దీగా చేయడంలో హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా లవంగాల్లోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, అనేక పోషకాలు ఇమ్యూనిటీని బలంగా చేస్తాయి.
జీర్ణ సమస్యలు.. కడుపులో అల్సర్‌తో బాధపడేవారికి కూడా లవంగాలు తీసుకోవడం మంచిది. లవంగాల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పెప్టిక్ అల్సర్ వల్ల వచ్చే మంటను తగ్గించేందుకు హెల్ప్ చేస్తాయి. ఇది నొప్పి, వాపు నుండి రిలీఫ్‌నిస్తాయి.
బరువు తగ్గడం.. లవంగాల్లో పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి స్పీడ్‌గా బరువుని తగ్గిస్తాయి. ఇందులో యూజినాల్, యాంటీ ఆక్సిడెంట్, డైటరీ ఫైబర్, విటమిన్స్ ఈ, సి, కె, ఎలు ఉన్నాయి. ఇవి జీవక్రియని పెంచి, కేలరీలను వేగంగా బర్న్ చేస్తాయి. ఈ విధంగా ఇది కొవ్వుని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి.
లవంగాల్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. అంటే.. ఫ్లేవనాయిడ్స్, ఫెనోలిక్ గుణాలు. అలాగే విటమిన్ C కూడా ఉంటుంది. ఇవి మన శరీరంలో విష వ్యర్థాలను తొలగిస్తాయి. ప్రాణాంతకమైన వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి.
 లవంగాల్లో యూజెనాల్ అనే తైలం ఉంటుంది. ఇది శరీరంలో వేడిని తగ్గించగలదు. కీళ్లనొప్పుల (Arthritis)తో బాధపడేవారు.. రెగ్యులర్‌గా లవంగాలను వాడటం వల్ల ఉపశమనం కలుగుతుంది.
యూజెనాల్ తైలం.. యాంటీసెప్టిక్‌లా పనిచేసి.. చిగుళ్లను కాపాడుతుంది. నోట్లోని రకరకాల సమస్యలను పోగొడుతుంది. హానికర బ్యాక్టీరియాను చంపేస్తుంది.
 పొట్ట లోపల ఆరోగ్యంగా ఉందో లేదో మనకు తెలియదు. అందువల్ల లవంగాల వంటివి వాడితే.. అవి పొట్టలోపల అంతా క్లీన్ చేస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.  జీర్ణరసాలు ఊరేలా చేస్తాయి. పొట్టకు లవంగాలు అన్ని రకాలుగా మేలు చేస్తాయి.
లవంగాల్లోని విటమిన్ Cని అమృతంతో పోల్చుకోవచ్చు. ఎందుకంటే.. ఇది మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. రెగ్యులర్‌గా వాడుతూ ఉంటే.. అడ్డమైన వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.

లవంగాల్లోని యాంటీఆక్సిడెంట్స్, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు.. గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. బీపీ (blood pressure)ని తగ్గిస్తాయి. రక్తనాళాలు బాగా పనిచేసేలా చేస్తాయి. గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
లవంగాల్లో యాంటీమైక్రోబయల్ గుణాలు ఉన్నాయి. ఇవి శ్వాస సమస్యలకు చెక్ పెడతాయి. దగ్గు, జలుబు, ముక్కుదిబ్బడ వంటి వాటిని తగ్గిస్తాయి. అలాగే శ్వాసనాళాల్లో గాలి తేలిగ్గా కదిలేలా చేస్తాయి.
లవంగాల్లోని యూజెనాల్ ఆయిల్.. బ్రెయిన్ కణాలకు టెన్షన్ తగ్గిస్తాయి. బ్రెయిన్ హీట్ ఎక్కకుండా చేస్తాయి. నాడీ సంబంధ వ్యాధులు రాకుండా కాపాడతాయి.
 సుదూర ప్రయాణాలు చేయాల్సివచ్చినప్పుడు జేబులో కొన్ని లవంగాలు వేసుకొని వెళ్లండి. ప్రయాణం పడని వారు, వాంతులు చేసుకునే సమస్య ఉన్నవారు ఆ సమయంలో రెండు లవంగాలు నోట్లో వేసుకుంటే సరి.
 లవంగాలు క్యాన్సర్ కణాలతో పోరాడుతాయి. వీటిలో ఉండే ఎల్లాజిక్ యాసిడ్ సమ్మేళనాలు క్యాన్సర్ అభివృద్ధిని నిరోధించడంలో సాయపడతాయి. శరీరంలో క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందకుండా పోరాడుతాయని పరిశోధనల్లో తేలింది.
 లవంగాల్లో ఉండే యాంటీ వైరల్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు జలుబు రాకుండా నివారిస్తాయి.
 లవంగాలు వేడి నీటిలో వేసుకొని పుక్కిలిస్తే.. గొంతునొప్పి, నోటి అల్సర్లు తగ్గుముఖం పడుతాయి.
 ఎముకలు బలంగా తయారవడానికి లవంగాలు తోడ్పడుతాయి. ఇందులోని మాంగనీస్ ఎముక పుష్టికి ఉపయోగపడుతుంది.
 గ్యాస్, కడుపు ఉబ్బరంగా ఉండడం వంటి ఆరోగ్య సమస్యలకు లవంగం మంచి ఔషధం.
 లవంగాల్లో గ్లూకోజ్​ ను  తగ్గించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి.
ఇలా ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే.. మన ఇళ్లలో మసాలా కర్రీల్లో లవంగాల్ని బాగా వాడుతారు. రోజుకి 1 లేదా 2 లవంగాల్ని బుగ్గన పెట్టుకొని నమలడం మంచిదే. లేదంటే లవంగాల టీ తాగొచ్చు. ఐతే.. లవంగాలను మరీ ఎక్కువగా వాడకూడదు. ఎక్కువగా వాడితే కొత్త సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.