Good Health: ధనియాలు... ఔషధ గుణాల నిలయం..  ఆరోగ్యానికి అమృతం.. ఎన్ని ఉపయోగాలున్నాయంటే..

Good Health: ధనియాలు... ఔషధ గుణాల నిలయం..  ఆరోగ్యానికి అమృతం.. ఎన్ని ఉపయోగాలున్నాయంటే..

ధనియాలకు వంటల్లో ఎంత ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలిసిందే. ధనియాలు మంచి ఔషధం లాగా పని చేస్తాయి. ఆయుర్వేద ప్రకారం ఇవి అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. ధనియాలతో పలు అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. వీటిలో వల్ల మనకి చాలా బెనిఫిట్స్ కలుగుతాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా ఇళ్లలో రోజు వాడే ఆహారపదార్థాల్లో కొత్తిమీర కూడా ఒకటి. ఇది వంటకు మంచి రుచి ఇవ్వడంతో పాటు సువాసనను కూడా అందిస్తుంది. కొత్తిమీర తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. అయితే దాని పుట్టుకకు కారణమైన ధనియాలు కూడా అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెడతాయి.  మార్కెట్‌లో చవకగా దొరికే ధనియాలను నానబెట్టిన నీరు తాగటం ఊహించని ఫలితాలు పొందవచ్చు.ధనియాలను నానబెట్టిన నీరు తాగితే ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి. ధనియాల వాటర్‌తో ఈజీగా బరువు తగ్గుతారు. 

ఇమ్యూనిటీ బూస్టర్:  రోగనిరోధక వ్యవస్థ అనేది శరీరంలో ప్రధాన వ్యవస్థ. ఏ వ్యాధితో పోరాడాలన్నా రోగ నిరోధక వ్యవస్థ మనకు సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని సహజంగా పెంచే ఆహార పదార్థాలు ధనియాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇండియన్ కిచన్ లో అందుబాటులో ఉండే ధనియాలు శరీరంలో రాడికల్, ఎలిమెంట్లకు వ్యతిరేకంగా పోరాడతాయి. ఏ వ్యాధితో పోరాడాలన్నా రోగ నిరోధక వ్యవస్థ మనకు సహాయపడుతుంది.

వెంట్రుకలకు బలం: ధనియాల్లో విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును బలంగా ఉంచడానికి సహాయపడతాయి. గ్లాస్ నీటిలో ధనియాలను నానబెట్టి తాగడం వల్ల వెంట్రుకలు కుదుళ్ల నుంచి ఆరోగ్యంగా ఉంటాయి. అంతే కాకుండా జుట్టు రాలడం సమస్య తగ్గిపోవడంతో పాటు చిట్లిపోవడం వంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. ధనియాలు హెయిర్ మాస్క్ లాగా చక్కగా ఉపయోగపడతాయి.

బ్లడ్ షుగర్ లెవల్స్: నానబెట్టిన ధనియాల వాటర్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. డయాబెటిస్ పేషెంట్లు బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగకుండా ఉండేందుకు ధనియాల వాటర్ తాగటం మంచిది.

పింపుల్స్ అండ్ పిగ్మెంటేషన్:ధనియాలలో ఉండే ఐరన్.. ఫంగస్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. వీటిలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ గుణాలు మొటిమలను తగ్గిస్తాయి. మృదువైన చర్మం కావాలనుకునే వారు క్రమం తప్పకుండా ధనియాల వాటర్ తాగడం మంచిది.

బరువు తగ్గడం:ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. అధిక బరువు వల్ల ఇబ్బంది పడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయితే బరువు తగ్గడానికి ధనియాలు ఎంతగానో ఉపయోగపడతాయి. నానబెట్టిన ధనియాల వాటర్ తాగడం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. ఉదయాన్నే ధనియాల వాటర్ తాగడం వల్ల అరుగుదల బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా జీర్ణక్రియ కూడా మెరుగ్గా పనిచేస్తుందని చెబుతున్నారు.

క్రమం తప్పకుండా ధనియాల వాటర్ తాగటం వల్ల శరీర బరువు కూడా తగ్గుతుంది. ఈజీగా బరువు తగ్గటానికి ధనియాల వాటర్‌ను ఎంతగానో ఉపయోగపడుతుంది. 15 రోజులు క్రమం తప్పకుండా ధనియాల వాటర్ తాగడం బరువు తగ్గుతారు. బరువు తగ్గటం కోసం సరైన డైట్ పాటిస్తూనే ధనియాల వాటర్ తాగటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.


ధనియాల వాటర్ తయారు చేయడం ఎలా ?

కావాల్సినవి:

  • ఒక టేబుల్ స్పూన్ ధనియాలు
  • ఒక గ్లాస్ నీరు

రాత్రి ఒక గ్లాస్ నీటిలో ఒక టేబుల్ స్పూన్ ధనియాలను వేసి నానపెట్టాలి. మరుసటి రోజు ఉదయం ధనియాల గింజలు తీసేసి నీటిని వడగట్టుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల 15 రోజుల్లోనే మీ శరీరంలో మార్పును గమనించవచ్చు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును ధనియాల వాటర్ కలిగిస్తుంది

ఇంకా ఏమేమి ఉన్నాయంటే

  • పీరియడ్స్ సమయంలో ఆరు గ్రాముల ధనియాలను ఒక అర లీటర్ నీళ్లు కలిపి సగం నీళ్లు అయ్యేంత వరకూ మరిగించి, ఇందులో పటిక బెల్లం లేదా తేనె కలిపి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే రక్తస్రావం ఆధిక్యత తగ్గుతుంది. పైగా పీరియడ్స్ సరిగ్గా సమయానికి వస్తాయి.
  •  చర్మ సమస్యలను తగ్గించడంలో ధనియాలు బాగా పని చేస్తాయి. గజ్జి, చర్మం, దురదలు, దద్దుర్లు, వాపులను తగ్గించడంలో ధనియాలు బాగా ఉపయోగపడతాయి.
  • ధనియాల్లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది లివర్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో మలబద్ధకం కూడా తగ్గుతుంది.
  • ర‌క్తంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే హార్ట్ ఎటాక్ లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి.
  • ధనియాలు నాననెట్టిన నీటిని తాగితే ఎసిడిటీ సమస్య తగ్గిస్తుంది, శరీరంలో అధిక కొవ్వును కరుగుతుంది. 
  • టేబుల్ స్పూన్ ధనియాలను గ్రైండ్ చేసి ఒక గ్లాసు నీటిలో కలపండి. ఆ నీటిని మరిగించి ఉదయాన్నే తాగాలి. ఇది థైరాయిడ్ తో పాటు అనేక ఇతర అనారోగ్య సమస్యలను తొలగిస్తుంది.

ధనియాలు ఏ రూపంలో తీసుకున్నా మంచి ప్రయోజనాలు ఉంటాయి. ధనియాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరానికి మేలు చేస్తాయి. దీని కారణంగా ఫ్రీరాడికల్స్ ను ఎదుర్కోవడానికి బాగా సహాయపడతాయి. కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా ధనియాలు ఉపయోగ పడతాయి. ధనియాల పొడి మచ్చలను నివారిస్తుంది. ధనియాల పొడి లో పసుపు వేసి పేస్ట్ లాగ చేసి ముఖానికి పట్టించి ఉంచితే మంచి ఫలితం కనబడుతుంది.