Good Health : కొత్తిమీర తినటం కాదు తాగండి.. 30, 40 రోగాలను ఇట్టే మాయం చేస్తుంది.. తగ్గిస్తుంది..!

Good Health : కొత్తిమీర తినటం కాదు తాగండి.. 30, 40 రోగాలను ఇట్టే మాయం చేస్తుంది.. తగ్గిస్తుంది..!

కొత్తిమీర వలన ఎన్నో ఉపయోగాలున్నాయి.  కొత్తిమీర రసం పొద్దున్నే తాగితే పదికాలాల పాటు ఆరోగ్యంగా బతకొచ్చని వైద్య నిపుణులు  చెబుతున్నారు.  బరువు సమస్య.. ఎసిడిటీ.. అల్సర్​.. ఇన్​ఫెక్షన్​ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాయి. వీటితో పాటు కొత్తిమీర రసం వలన  కలిగే   కొన్ని ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కొత్తిమీరలో అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయి. ఒంట్లో పేరుకుపోయిన సీసం, అల్యూమినియం, కాడ్మియం, పాదరసం లాంటి ఖనిజాల వల్ల హార్మోన్ల సమతౌల్యం దెబ్బ తింటుంది. వాటిని కొత్తిమీర రసం బయటకు పంపిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను పెంపొందించి, ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో కూడా చాలా ఉపయోగపడుతుంది.

కొత్తిమీర రసం రోజూ తాగితే కలిగే ప్రయోజనాలు 

  • కాలేయం పనితీరు బాగుంటుంది. 
  •  డయాబెటిస్ ఉన్న వాళ్లు రోజూ తీసుకుంటే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. 
  • జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. 
  •  గ్యాస్, గుండెల్లో మంట, అజీర్తి వంటి సమస్యలు దూరమవుతాయి. 
  •  కారం ఎక్కువగా తినేవాళ్లు కొత్తిమీర జ్యూస్ తాగితే మంచిది. 
  • మెదడు సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది. 
  •  ఈ జ్యూస్ క్రమం తప్పకుండా తీసుకుంటే కంటి చూపు బాగుంటుంది. 
  •  ఎముకలను దృఢంగా ఉంచుతుంది. 

వారానికి ఒకసారి తీసుకుంటే 

  •  శరీరానికి ఎ, బి1, బి2, సి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. 
  •  ఐరన్ లోపంతో బాధపడే వారు దీన్ని తీసుకోవచ్చు. 
  • నోటి దుర్వాసనను తగ్గిస్తుంది. 
  • కొత్తిమీర టీ తాగితే రక్తంలోని కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీనిలో ఉండే ప్లేవనాయిడ్లు, ఫైటో కెమికల్స్ శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి బరువు తగ్గిస్తాయి. 
  •  కండరాల క్షీణత, ఆర్థరైటిస్, గుండె జబ్బులతో పాటు అల్జీమర్, క్యాన్సర్ రాకుండా కొత్తిమీరలోని యాంటీ ఆక్సిడెంట్లు పోరాడతాయి. 
  •  నిద్రలేమితో బాధపడేవారు దీన్ని తీసుకుంటే ఆ సమస్య పోతుంది. 
  • తరచూ ఒత్తిడికి గురయ్యేవాళ్లకి కొత్తిమీర రసం మంచి మందు. 
  • దీనిలో పొటాషియం ఎక్కువ. కాబట్టి రక్తసరఫరా మెరుగవుతుంది. 
  • ధమనుల్లో కొవ్వు పెరగకుండా చేస్తుంది. అందువల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. 
  •  ఈకొలి, స్టాఫిలోకోకస్ బ్యాక్టీరియాల కారణంగా వచ్చే మూత్ర సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. 
  •  కలరా,సాల్మోనెల్లా, లిస్టేరియా, ఫుడ్ పాయిజనింగ్ బారిన పడకుండా రక్షిస్తుంది. 
  • అయితే గర్భిణులు, పిల్లలకు పాలిచ్చే తల్లులు కొత్తి మీర తీసుకోకపోవడం మంచిది

- ‌‌వెలుగు, లైఫ్​–