వాతావరణం కాస్త చల్లబడితే చాలు .. ముందుగా మనకు గుర్తొచ్చేది మొక్కజొన్న.. వేడి వేడి తింటే రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి ఎన్నో లాభాలను చేకూరుస్తాయి. అంతేకాదు.. దీర్ఘకాలిక వ్యాధులకు కూడా ఇది చాలా మంచి మందు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మొక్కజొన్న వల్ల ఆరోగ్యానికి ఎన్ని లాభాలున్నాయో తెలుసుకుందాం. .
- మొక్కజొన్నలోని విటమిన్-బి12, ఇనుము, ఫోలిక్ యాసిడ్ రక్తహీనతకు చెక్ పెడతాయి. అలాగే ఇందులోని బిటాకెరొటిన్ శరీరంలోకి చేరాక విటమిన్-ఏగా మారుతుంది.
- మొక్కజొన్నలో ఉండే కెరొటినాయిడ్లు, బయో ఫ్లేవనాయిడ్లు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతాయి.
- కండరాలను దృఢంగా ఉంచుతాయి.
- వానా కాలంలో ఎక్కువగా మొక్కజొన్న తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ శాతం కూడా పూర్తిగా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు
- ఇది కంటిచూపుని మెరుగుపరుస్తుంది.
- మొక్కజొన్నలోని పిండి పదార్థాలు శరీరానికి శక్తినిచ్చి చురుగ్గా ఉండేలా చేస్తాయి. అలాగే మొక్కజొన్న నుంచి లభించే ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్లు గుండెని ఆరోగ్యంగా ఉంచుతాయి.
- గర్భిణులకు అవసరమయ్యే ఫోలిక్ యాసిడ్ కూడా మొక్కజొన్నల నుంచి అందుతుంది.
Also Read :- స్టీమ్ బాత్ చేస్తే
–వెలుగు.. లైఫ్–