Good Health: వర్షాకాలం.. బెస్ట్​ ఫుడ్​ ఇదే..

Good Health: వర్షాకాలం..  బెస్ట్​ ఫుడ్​ ఇదే..

వర్షంలో వేడి వేడి మొక్క జొన్నపై నిమ్మరసం, ఉప్పు, కారం జల్లి తింటుంటే వచ్చే మజానే వేరు. ఈ సీజన్ లో సాయంత్రం అయితే చాలు.. రోడ్డు పక్కనున్న బండి దగ్గర నిలబడి కాల్చిన మొక్కజొన్నను తింటుంటారు. వర్షాకాలంకి పర్ఫెక్ట్ కాంబినేషన్ లో మొక్కజొన్న పొత్తులు ఒకటి ... వర్షం పడుతున్న టైమ్ లో వేడి వేడిగా కాల్చిన మొక్కజొన్న పొత్తులు తింటే భలే ఉంటాది అసలు ఇలాంటి వాతావణంలో మొక్కజొన్న పొత్తు తింటే ఉంటదండి.. అసలు  మొక్క జొన్నల పొత్తులను తింటే ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం. . .
 
మొక్కజొన్న కూడా మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మొక్కజొన్నలో ఇనుము, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు దీనిలో విటమిన్ ఏ, విటమిన్ బి కాంప్లెక్స్ లు కూడా ఉంటాయి. వర్షాకాలంలో రోడ్ల పక్కనున్న తోపుడు బండ్ల మీద వీటిని ఎక్కువగా అమ్ముతుంటారు. అయితే ఇవి టేస్టీగా ఉండటమే కాకుండా.. మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. కానీ వర్షాకాలంలో  కాల్చిన మొక్కజొన్న పొత్తు తింటే చాలా ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణలు చెబుతున్నారు.  
 
ఇమ్యూనిటీ పవర్: కాల్చిన మొక్కజొన్నను మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. దీనిలో విటమిన్ ఎ, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ఈ మొక్కజొన్న పొత్తు తింటే మన రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. 

మలబద్ధకం: మొక్కజొన్న మలబద్దకం వంటి జీర్ణ సమస్యలను తగ్గించడానికి కూడా బాగా సహాయపడుతుంది. మొక్కజొన్నలో ఎక్కువ మొత్తంలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. కాల్చిన మొక్కజొన్నను తింటే మలబద్దకం నుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే దీన్ని మీరు ఉడకబెట్టి కూడా తినొచ్చు. 

మెరుగైన కంటిచూపు: మొక్కజొన్నలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిని మన డైట్ లో చేర్చుకుంటే కంటిచూపు బాగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇది కంటి సమస్యలు రాకుండా కూడా కాపాడుతుంది. 

గుండె ఆరోగ్యం: వర్షంలో కాల్చిన మొక్కజొన్నను తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని తినడం వల్ల హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గుతుందట. అలాగే గుండె ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది: మొక్కజొన్నలో విటమిన్ సి, బయోఫ్లవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, ఫైబర్ వంటి లక్షణాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. మొక్కజొన్నలోని ఈ లక్షణాలు శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి బాగా సహాయపడతాయి. 

బలమైన ఎముకలు : మొక్కజొన్నల్లో ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్ వంటి గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఎముకలను బలోపేతం చేయడానికి ఎంతో ఉపయోగపడతాయి. దీనిని తింటే ఆర్థరైటిస్ నొప్పులు కూడా తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 
చర్మానికి మేలు: మొక్కజొన్నలో విటమిన్ ఎ, విటమిన్ సి తో పాటుగా ఇతర యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. మొక్కజొన్నలను తింటే మన శరీరం ఆరోగ్యంగా ఉండటంతో పాటుగా మన చర్మం కూడా హెల్తీగా, ప్రకాశవంతంగా ఉంటుంది. 

క్యాన్సర్​ కణాలను నాశనం చేసే గుణం: క్యాన్సర్‌లను తరిమికొట్టడంలో కూడా మొక్కజొన్న ఉపయోగపడుతుంది. ఇందులోని ఫెలోరిక్‌ యాసిడ్‌ అనే శక్తి వంతమైన యాంటీయాక్సిడెంట్స్‌ క్యాన్సర్‌ కణాలను నాశనం చేస్తుంది. ఎముకలు దృఢంగా ఉండాలంటే మొక్కజొన్నను కచ్చితంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని మెగ్నీషియం, ఐరన్‌, కాపర్‌, ఫాస్పరస్‌ ఎముకలను గట్టి పడేలా చేస్తాయి.

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది: ఇందులోని ఎన్నో దివ్య గుణాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ఉపయోగపడుతుంది. కిడ్నీ సమస్యలకు చెక్‌ పెట్టడంలో కూడా మొక్క జొన్న ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని మినరల్స్‌ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి.

పుష్కలంగా ఫోలిక్‌ యాసిడ్‌: మొక్క జొన్నలో ఫోలిక్‌ యాసిడ్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త హీనతను తగ్గిస్తుంది.  . మొక్క జొన్నలో విటమిన్‌ బీ12 పుష్కలంగా ఉంటుంది. అలాగే ఐరన్‌ కూడా అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో ఎర్ర రక్త కణాల అభివృద్ధిలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గర్భిణీలు వీటిని తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

మొక్కజొన్న రోగనిరోధక వ్యవస్థను పెంపొందిస్తుంది. డయాబెటీస్‌ని మరియు అధిక రక్త పోటును నియంత్రిస్తుందని. దీని నుంచి విటమిన్స్‌ మరియు మినరల్స్‌ పుష్కలంగా లభిస్తాయి