Good Health : రోజూ పెరుగు తింటే మీ ఆరోగ్యం ఇలా ఉంటుంది..!

Good Health : రోజూ పెరుగు తింటే మీ ఆరోగ్యం ఇలా ఉంటుంది..!

పెరుగు తినడం ఆరోగ్యవంతమైన జీవితానికి ఎంతో మేలు చేస్తుంది. పెరుగు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం దాని వైపు తిరగకుండా ఉండలేరు. ఇందులో ప్రొటీన్, కాల్షియం, రిబోఫ్లావిన్, విటమిన్ బి6, విటమిన్ బి12 ఉంటాయి. మీ ఆరోగ్యానికి అవసరమైన అన్ని ఉపయోగకరమైన పోషకాలను కలిగి ఉంటుంది.  పెరుగు తింటే ఎలాంటి ఉపయోగాలున్నాయో తెలుసుకుందాం..

వంటగదిలో సాధారణంగా కనిపించే పదార్థాలలో పెరుగు చాలా ముఖ్యమైనది. ఇది చాలా పోషకమైనది. 

పెరుగు వలన ఉపయోగాలు

  • జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది పెరుగు  ప్రోబయోటిక్స్ జీర్ణక్రియకు ఉపయోగపడతాయి
  • ఉబ్బరం... మలబద్ధకాన్ని తగ్గిస్తుంది
  •  ఆరోగ్యకరమైన ప్రేగులను ప్రోత్సహిస్తుంది
  • రోగనిరోధక శక్తిని పెంచుతుంది
  • విటమిన్లు ..  ఖనిజాలతో సమృద్ధిగా ఉన్న పెరుగు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది
  • ఎముకలు ...దంతాల ఆరోగ్యానికి చాలా మంచిది
  • పెరుగులో  కాల్షియం  విటమిన్ డి ఎక్కువుగా ఉంటాయి
  • పెరుగు కార్టిసాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది 
  • పెరుగులోని లాక్టిక్ యాసిడ్ ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది
  • సహజమైన మెరుపును ప్రోత్సహిస్తుంది . మృత చర్మ కణాలను తొలగిస్తుంది
  • పెరుగులో ఉండే ప్రోటీన్ మరియు ఎలక్ట్రోలైట్స్ వ్యాయామం తర్వాత కండరాలు బలోపేతానికి తోడ్పడతాయి
  • పెరుగు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 
  • ఇది నిద్ర సమస్యలను తొలగించడంలో ఉపయోగపడుతుంది
  • పెరుగు మంచి ఎనర్జీ బూస్టర్. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. పెరుగు ఒక అద్భుతమైన యాంటీఆక్సిడెంట్.. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. 
  • గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండేందుకు పెరుగు ఉపయోగపడుతుంది. 
  • పెరుగు జుట్టు కుదుళ్ల నుండి చర్మాన్ని మృదువుగా చేయడానికి ఉపయోగిస్తారు.

–వెలుగు.. లైఫ్​–