సాధారణంగా కొంత మంది ఆకుకూరలు తినడానికి అంతగా ఇష్టపడరు. ఇంక ఆకుకూరల జ్యూస్ అంటే అసలే తాగారు. ఆసుకూరలతో తయారు చేసే జ్యూసెస్ రుచిగా ఉండకపోయిన ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే రాత్రి సమయంలో నిద్రపోవడానికి అరగంట ముందు ఆకుకూరల జ్యూస్ తాగితే అనేక సమస్యలనుంచి ఉపశమనం పొందుతారని వైద్య నిపుణులు చెబుతున్నారు.
శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది: దీనిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. అలాగే శరీరంలో అధిక ఉష్ణోగ్రతలను తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది. రోజూ డైట్ రాత్రి సమయంలో ఆకుకూరల జ్యూస్ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
యాంటీ ఇన్ఫలమేటరి గుణాలు: ఆకుకూరల రసంలో యాంటీ ఆక్సిడెంట్స్ , యాంటీ ఇన్ఫలమేటరీ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి శరీరంలో మంట, ఇన్ఫెక్షన్స్, గాయాలను తగ్గించడానికి తోడ్పడతాయి. అంతే కాదు యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తిని పెంచి రోగాల బారి నుంచి రక్షిస్తాయి.
శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది: దీనిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. అలాగే శరీరంలో అధిక ఉష్ణోగ్రతలను తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది. రోజూ డైట్ సెలరీ జ్యూస్ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
జీర్ణక్రియ ఆరోగ్యం : రోజూ రాత్రి సమయంలో ఆకుకూరల జ్యూస్ తీసుకుంటే శరీరంలో టాక్సిన్స్ ను బయటకు పంపి.. జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే దీనిలోని అధిక ఫైబర్ బోవేల్ మూమెంట్ ఫ్రీగా అవ్వడానికి సహాయపడుతుంది. దీంతో మలబద్దకం, కడుపుబ్బరం వంటి జీర్ణక్రియ సమస్యల ప్రమాదం తగ్గుతుంది.
రక్తపోటును తగ్గించును: రోజూ రాత్రి సమయంలో ఆకుకూరల జ్యూస్ తీసుకుంటే శరీరంలో అధిక రక్తపోటును తగ్గించి.. గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. అలాగే దీనిలోని హై ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ను నిర్వహించడం, బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుచును: దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించి.. చర్మం ప్రకాశవంతమైన చర్మాన్ని అందిస్తాయి . అలాగే హై వాటర్ కంటెంట్ చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.
శరీరంలో మంట తగ్గించడంలో.. రాత్రిసమయంలో నిద్రపోవడానికి అరగంట ముందు ఆకుకూరల జ్యూస్ తాగితే ... ఇందులో ఉండే యాంటీ యాక్సిడెంట్లు, యాంటా ఇన్ఫ్లమేటరీ కాంపౌడ్స్ శరీరంలో మంటను తగ్గిస్తాయి.
బరువు తగ్గేందుకు : ఆకుకూరల జ్యూస్ లో క్యాలరీలు తక్కువగానూ... నీటిశాతం ఎక్కువగానూ ఉండటం వల్ల బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాదు అదనపు కేలరీలు లేకుండా పోషకాలను అందిస్తుంది.
ఇంకా ఏమేమి ఉన్నాయంటే...
- రాత్రిపూట ఆకుకూరలు తాగితే మలబద్ధకం రాదు
- ఆకుకూరల నీటిని తాగడం వల్ల నిద్రలేమి సమస్య నయమవుతుంది.
- నిద్రవేళకు ముందు ఆకుకూరల నీటిని తాగడం వల్ల కడుపుకు మేలు జరుగుతుంది.
- ఆకుకూరల నీరు తాగడం వల్ల వెన్నునొప్పి, కీళ్ల నొప్పులు నయమవుతాయి.
- రాత్రిపూట ఆకుకూరలు తాగితే విరేచనాలు రావు