Good Health: బొప్పాయి గింజల్లో అదిరిపోయే విటమిన్లు... వీటి ఉపయోగం తెలిస్తే అసలు పడేయరు..

Good Health: బొప్పాయి గింజల్లో అదిరిపోయే విటమిన్లు... వీటి ఉపయోగం తెలిస్తే అసలు పడేయరు..

బొప్పాయి పండు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ, పండులోని గింజలు సైతం ఆరోగ్యాన్ని కలిగిస్తాయని మీకు తెలుసా? నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం. పండు మధ్యలో మనకు నల్లటి గింజలు కనపడుతూ ఉంటాయి. ఇవి రుచి కొంచెం చేదుగా ఉంటుంది. చూడటానికి మాత్రం మిరియాల్లాగా ఉంటాయి. కానీ, వీటిని తినడం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయట. అవేంటో ఓసారి చూద్దాం...

 బొప్పాయి  గింజల్లో  చాలా ఔషధగుణాలు ఉన్నాయి. ఇవి  కొంచెం చేదుగా ఉంటాయి. కానీ ఈ గింజల్లో మాత్రం అనేక పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి.వీటిని తినడం వల్లన అనేక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. బొప్పాయి గింజలను నేరుగా తినలేం కాబట్టి వాటిని ఎండబెట్టి, మెత్తగా పొడి తయారు చేసుకొని ఆహార పదార్ధాలు తినేటప్పుడు గాని, స్మూతీస్, సలాడ్లు, ఇతర వంటకాల రూపంలో తీసుకోవచ్చు. విత్తనాలు కొద్దిగా మిరియాలు రుచిని కలిగి ఉంటాయి కాబట్టి మసాలాగా ఉపయోగించవచ్చు. ఇది శరీరాన్ని అనేక సమస్యల నుండి కాపాడుతుంది.

1. మెరుగైన జీర్ణక్రియ:  బొప్పాయి గింజల్లో జీర్ణక్రియకు సహాయపడే పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు  సహాయపడుతుంది. ఇది కడుపు  వ్యాధులను నయం చేస్తుంది.ఉబ్బరం, మలబద్ధకం , అజీర్ణం వంటి జీర్ణ సమస్యలను నివారించడానికి మీరు భోజనం తర్వాత ఒక టీస్పూన్ తాజా బొప్పాయి గింజలను తీసుకోవచ్చు.

2. కాలేయ ఆరోగ్యం: బొప్పాయి విత్తనాలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరం నుండి విషాన్ని తొలగించడానికి, కాలేయ పనితీరుకు తోడ్పడతాయి. బొప్పాయి గింజల్లో ఉండే సమ్మేళనాలు కాలేయ పని తీరును మెరుగుపర్చడంలో సహాయపడతాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. బొప్పాయి గింజలు తీసుకోవడం వల్లన UV కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. ముడతలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఒక టేబుల్ స్పూన్ బొప్పాయి గింజలను గ్రైండ్ చేసి, వాటిని ఒక గ్లాసు రసం లేదా నీటిలో కలపండి. కాలేయ ఆరోగ్యానికి తోడ్పడటానికి ఈ మిశ్రమాన్ని కొన్ని వారాల పాటు రోజుకు ఒకసారి తీసుకోండి.

3. ఫ్లేవనాయిడ్లు& యాంటీ ఆక్సిడెంట్లు : బొప్పాయి గింజలలో ఫ్లేవనాయిడ్లు , ఫినాలిక్ సమ్మేళనాలు ఉండటం వల్ల వాపు తగ్గుతుంది. ఆర్థరైటిస్ వంటి ఇన్ఫ్లమేటరీ పరిస్థితుల నుండి ఉపశమనం లభిస్తుంది. బొప్పాయి గింజల్లో యాంటీఆక్సిడెంట్లు , యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ పుష్కలంగా ఉన్నాయి. మీరు సలాడ్లు, స్మూతీలు లేదా పెరుగుపై పిండిచేసిన విత్తనాలను చల్లుకోవచ్చు.వాటి యాంటీఆక్సిడెంట్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల నుండి నట్టి రుచిని , ప్రయోజనం పొందవచ్చు.

4. రోగనిరోధక శక్తిని పెంచడం: బొప్పాయి గింజలు విటమిన్ సితో నిండి ఉన్నాయి, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కొల్లాజెన్ ఉత్పత్తిలో సహాయపడుతుంది, ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు మరియు గోళ్లను ప్రోత్సహిస్తుంది.

5. బరువు తగ్గడానికి: బొప్పాయి గింజలు అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా బరువు నిర్వహణలో సహాయపడతాయి. బొప్పాయి గింజల్లో ఉండే అధిక పీచు పదార్థం మిమ్మల్ని ఎక్కువసేపు నిండుగా ఉంచడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, బరువు నిర్వహణలో సహాయపడుతుంది. విత్తనాలు జీర్ణవ్యవస్థను నియంత్రించడంలో సహాయపడతాయి, సంపూర్ణత  భావాలను పెంచుతాయి. బరువు తగ్గించే ప్రయత్నాలకు మద్దతు ఇస్తాయి. బరువు నిర్వహణలో సహాయపడటానికి మీరు వాటిని నేరుగా తినవచ్చు లేదా మీ భోజనంలో చేర్చుకోవచ్చు.

6. యాంటీ-పారాసిటిక్ లక్షణాలు: బొప్పాయి గింజలు యాంటీ-పారాసిటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి.కొన్ని గింజలను చూర్ణం చేసి, వాటిని ఒక టేబుల్ స్పూన్ తేనె లేదా పెరుగుతో కలపండి. శరీరం నుండి పరాన్నజీవులను బహిష్కరించడానికి ఈ మిశ్రమాన్ని ఖాళీ కడుపుతో ఒక వారం పాటు తినండి.

7. క్యాన్సర్ ను నిరోధకారి : బొప్పాయి గింజల్లో ఉండే పాలీఫెనాల్స్.. శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇవి అనేక రకాల క్యాన్సర‌ నుంచి మనల్ని రక్షిస్తాయి. క్యాన్సర్‌కు దూరంగా ఉండాలంటే.. 5, 6 బొప్పాయి గింజల పొడితో టీ చేసుకుని తాగండి.

8. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది: విత్తనాలలో గుండె-ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు , యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి LDL కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ,హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని నివారించడంలో సహాయపడతాయి.

9.పురుషులకు ప్రయోజనకరం: పుచ్చకాయ గింజలు తినడం వల్ల స్పెర్మ్ కౌంట్ మెరుగుపడుతుంది. అంతేకాక పురుషుల పునరుత్పత్తి వ్యవస్థకు అవసరమైన జింక్.. పురుషుల లైంగిక సామర్థ్యాన్ని మెరుగుపరిచే గ్లుటామిక్ యాసిడ్, మాంగనీస్, లైకోపీన్, లైసిన్, అర్జినిన్ ఉంటాయి. పుచ్చకాయ గింజలు తినడం వల్ల పురుషులలో సంతానోత్పత్తి పెరగడమే కాకుండా, జీర్ణక్రియ, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

10.నెలసరి నొప్పి: బొప్పాయి గింజలలో ఉండే కెరోటిన్.. ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇంకా ఋతుక్రమాన్ని ప్రేరేపించడంలో, దాని క్రమబద్ధతను పెంచడంలో ఇవి తోడ్పడతాయి. నెలసరి సమయంలో నొప్పిని తగ్గించడానికి కూడా బొప్పాయి గింజలు సహాయపడతాయి

11. కొలెస్ట్రాల్‌: బొప్పాయి గింజల్లోని ఫైబర్‌‌‌‌ శరీరంలోని కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. బొప్పాయి గింజల్లో ఒలీక్ యాసిడ్‌, ఇతర మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్‌ మెండుగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తాయి. అంతేకాదు వీటిలో ఉండే  కార్పైన్ అనే పదార్ధం పేగులలోని పురుగులు, బ్యాక్టీరియాను చంపుతుంది. ఈ విత్తనాలలోని అధిక ఫైబర్.. పేగులు బాగా కదిలేలా చేస్తుంది. ఫలితంగా జీర్ణక్రియ బాగా జరుగుతుంది. మలబద్ధకాన్ని పోతుంది.

12. టాక్సిన్స్..బొప్పాయి గింజల్లోని కొన్ని పదార్థాలు మన బాడీలోని టాక్సిన్స్‌ని బయటికి పంపుతాయి. దీంతో మన బాడీ క్లీన్ అవుతుంది. కాలేయ పనితీరు మెరుగవుతుంది. నానబెట్టిన బొప్పాయి గింజల నీటిని తాగితే బాడీ, కాలేయ సమస్యలు తగ్గుతాయి.

బొప్పాయిలో ఎ, బి, సి, ఇ, కె వంటి పలు విటమిన్లతో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, జింక్‌, ఫోలేట్‌ వంటి మినరల్స్ కూడా ఉంటాయి. బొప్పాయిలోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్‌ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. హైపర్‌టెన్షన్‌ను కూడా కంట్రోల్‌లో ఉంచుతాయి. జీర్ణక్రియకు మేలు చేసి.. కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కల్పిస్తుంది. అయితే బొప్పాయి మాత్రమే కాక దాని గింజలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణుల చెబుతున్నారు. మనం వేస్ట్‌ అని బయట పారేసే బొప్పాయి గింజలు అనేక ఆరోగ్యాల నుంచి మన శరీరాన్ని రక్షిస్తాయి.