Good Health: పసుపు పాలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..

Good Health: పసుపు పాలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..

వర్షాకాలం వచ్చింది. ఎప్పుడు ఎలాంటి అనారోగ్యం వస్తుందో తెలియని కాలం ఇది.  ఓ పక్క వానలు.. మరోపక్క ఆఫీసుకు వెళ్లాలంటే బద్దకం.. చికాకు.. అయినా సరే ఎందుకొచ్చిందిరా ఈ జీవితం అనుకుంటా సమయానికి బ్యాగు తగిలించుకొని బయలు దేరుతాం.. మధ్యలోకి వెళ్లగానే వర్షంలో తడవడం.. ఆపై జలుబు, జ్వరం.. ఇంకా ఎక్కువ అయితే ఆఫీసుకు మెడికల్​ లీవు పెట్టడం .. తీరా నెలాఖరుకు లాస్​ ఆఫ్​ పేతో జీతం తీసుకోవడం.. ఇలా జరుగుతుంటాయి.  ఇలా జరగకుండా ఉండాలంటే పసుపు పాలను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 

మనం నిత్యం వాడే వంటకాల్లో వాడే పసుపులో అనేక ఔషద గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా వానాకాలంలో తరుచుగా ఇబ్బంది పెట్టే వైరల్ ఇన్ ఫెక్షన్‌లు, చర్మ సమస్యలు, కంటి సమస్యలను నివారించవచ్చు. పసుపును పాలతో కలిపి తీసుకుంటే ఇందులోని ఔషద గుణాలు రెట్టింపు అవుతాయని అనేక పరిశోధనల్లో తేలింది. పాలలోని పోషకాలు, పసుపులోని ఔషద గుణాలు కలిసి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనంతో పాటు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ప్రతి రోజు ఒక గ్లాసు పాలల్లో ఒక స్పూన్ చక్కెర, చిటెకెడు పసుపు వేసుకొని తాగితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

 పసుపులో యాంటీ సెప్టిక్, కర్కుమిన్ అనే పోషకాలు అధికంగా ఉంటాయి.  పాలలో పసుపు కలిపి తీసుకుంటే ఊపిరితిత్తులోని కఫం కరగటంతో పాటు ఊపిరితీసుకోవడం సులభం అవుతుంది. ముక్కుదిబ్బడతో తల కట్టేస్తే వేడి వేడిగా ఈ పాలు తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది.వాతావరణంలో తేమ పెరగడంతో ఊపిరితిత్తులు కఫంలో నిండిపోతాయి. ఈ కారణంగానే దగ్గు, జలుబు సమస్యలు వేధిస్తాయితలనొప్పి వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి .  ఇవి శ్వాసకోస సమస్యల నుంచి తక్షణమే ఉపశమనాన్ని కలిగిస్తాయి. .యాంటీ ఆక్సిండెంట్లు, యాంటి ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉండే పసుపులో తలనొప్పి ఇతర నొప్పుల నుండి తగ్గిస్తుంది. 

 మహిళలు ఎక్కువగా నెలసరి సమయంలో అధిక రక్తస్రావం సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారికి పసుపు పాలు దివ్యౌషధం. శరీరంలో విడుదలయ్యే హార్మోన్ల ప్రభావం ఫలితంగా పొత్తి కడుపు ఇతర ఒంటి నొప్పులు బాధిస్తాయి. ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా త్రాగితే అతి తక్కువ సమయంలోనే రుతు బాధలు తగ్గుతాయి.చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. వారికి పసుపు పాలు మంచి స్లీపింగ్ టానిక్. పాలలో ఉండే సెరటోనిన్, మెలటోనిన్‌లు, పసుపులో ఉండే వైటల్ న్యూట్రియంట్స్‌తో కలిసి మానసిక ఒత్తిడిని తగ్గిచడంతో హాయిగా నిద్రపడతుంది.