IT Layoffs: ఐటీ కంపెనీల్లో ఫ్రెషర్స్ ఆన్బోర్డింగ్ ఆలస్యం..10 వేల ఉద్యోగాలు ఊడనున్నాయా..? 

IT Layoffs: ఐటీ కంపెనీల్లో ఫ్రెషర్స్ ఆన్బోర్డింగ్ ఆలస్యం..10 వేల ఉద్యోగాలు ఊడనున్నాయా..? 

IT Layoffs: ఐటీ కంపెనీల్లో గత మూడేళ్లుగా ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు లక్షల్లో ఐటీ ఎంప్లాయీస్ ఉద్యోగాలు కోల్పో యారు. 2024 ప్రారంభం నుంచే పలు ప్రముఖ ఐటీ కంపెనీలు తమ వర్క్ ఫోర్స్ ను తగ్గించాయి. కారణాలు ఏమైనా.. ఐటీ ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో 10 వేల ఉద్యోగాలు ఊడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫ్రెషర్స్ గా తీసుకున్న వారికి ఐటీ కంపెనీలు ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదని.. వీరిని తొలగించే అవకాశం ఉందా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి ఐటీ ఉద్యోగుల సంఘాలు..  

టీసీఎస్, ఇన్ ఫోసిస్, విప్రో, జెన్సర్ , ఎల్టీఐ మైండ్ ట్రీ వంటి కంపెనీలలో ఉద్యోగాలు ఆఫర్ చేసిన అభ్యర్థులను ఆన్ బోర్డింగ్ లో జాప్యం చేస్తున్నారని ఐటీ ఉద్యోగుల సంఘా లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రముఖ ఐటీ కంపెనీ అయిన విప్రో కూడా రెండేళ్ల క్రితం అభ్యర్థులకు అందించిన క్యాంపస్ ఆఫర్లను ఆన్ బోర్డు చేయ లేదు.

2022లో ప్రముఖ ఐటీ సేవల సంస్థల ద్వారా రిక్కూట్ అయిన 3-5 శాతం ఫ్రెషర్లకు ఇంకా ఆన్ బోర్డింగ్ ప్రక్రియ ప్రారంభం కాలేదని ఐటీ స్టాఫింగ్ కంపెనీ టీమ్ లీజ్ బిజినెస్ హెడ్ ఒకరు చెబుతున్నారు. ఇది ప్రాజెక్ట్ విజిబిలిటీ లేకపోవడంవల్ల కావచ్చు.అభ్యర్థులకు అవసరమైన స్కిల్స్ సెట్స్, ఉద్యోగంపై దృష్టిపెట్టకపోవడం కావచ్చని అంటున్నారు. 

టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి ఐటీ మేజర్ కంపెనీలు ఇటీవల 2023-24 ఆర్థిక సంవ్సతర  నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించాయి. మొత్తం ఆర్థిక సంవత్సరం తో ఉద్యోగుల తొలగింపులు చేపట్టినట్లు వెల్లడించాయి. మూడు కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించినట్లు పేర్కొన్నాయి.