బెంగళూరు: లాక్‌డౌన్ వల్ల చాలా కంపెనీలు జాబ్‌కట్స్ బాటపట్టగా, ఆన్‌లైన్ షాపింగ్ కంపెనీ అమెజాన్ మాత్రం 50 వేల మందికి టెంపరరీ జాబ్స్ ఇస్తామని ప్రకటించింది. ఆన్‌లైన్ షాపింగ్‌కు ప్రభుత్వం పూర్తిస్థాయిలో పర్మిషన్లు ఇవ్వడంతోఆర్డర్లు విపరీతంగా పెరిగాయి. డిమాండ్ తట్టుకోవడానికి సీజనల్/పార్ట్‌టైమ్ జాబ్స్ ఇస్తున్నామని అమెజాన్ తెలిపింది. సీజనల్ ఎంప్లాయిస్‌ను డెలివరీలకు, వేర్‌హౌజింగ్ పనుల కోసం ఉపయోగించుకుంటారు. ఫుడ్, క్యాబ్ అగ్రిగేటింగ్ కంపెనీలు స్విగ్గీ, జొమాటో, షేర్‌చాట్, ఓలా వంటి కంపెనీలు తమ ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటించగా, అమెజాన్ మాత్రం ఒకేసారి ఇంతమందికి ఉద్యోగాలు ఇవ్వడం విశేషం. దేశమంతటా ఇప్పటికీ సోషల్ డిస్టెన్సింగ్ రూల్స్ అమలవుతున్నందున, ఇంటి దగ్గరికే వస్తువులు తెచ్చి ఇవ్వడం చాలా ముఖ్యమని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అఖిల్ సక్సేనా చెప్పారు. డెలివరీలు పెరిగితే చిన్న, మధ్యస్థాయి కంపెనీలు కూడా బాగుపడతాయని వివరించారు. ‘‘కస్టమర్లకు సేవలు అందిస్తూనే వారి ఆరోగ్యానికి ఇబ్బందికాకుండా రూల్స్ ప్రకారం ప్రొడక్టులు డెలివరీ చేస్తాం. మా ఉద్యోగులు, పార్ట్‌నర్ల ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త తీసుకుంటాం. వీళ్లంతా ఫేస్‌మాస్క్ ధరించడం, చేతులు కడుక్కోవడం, టెంపరేచర్ చెకింగ్‌ను తప్పనిసరి చేశాం. బిల్డింగ్‌లను తరచూ శుభ్రం చేస్తున్నాం’’ అని ఆయన వివరించారు. ప్రస్తుతం ల్యాప్‌టాప్‌లు, ఏసీలు, ఫ్రిజ్‌ల కోసం ఎక్కువ మంది ఆర్డర్లు ఇస్తున్నారని అమెజాన్ తెలిపింది.
For More News..