
ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ మరోసారి లేఆఫ్స్ చేపట్టింది. ఇటీవల బెంగళూరు బ్రాంచ్లో ఉద్యోగులను తొలగించిన ఇన్ఫోసిస్ తాజా కంపెనీ అంతర్గత టెస్టులో ఉత్తీర్ణత సాధించని195ట్రైనీ ఉద్యోగులను తొలగించింది.దీంతో ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఇన్ఫోసిస్ నుంచి 800మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయారు. వీరికి రిలీవింగ్ లెటర్ తోపాటు ఒక నెల జీతం చెల్లించి ఇంటికి పంపించారు.
ఫిబ్రవరిలో 350 మందిని తొలగించిన ఇన్ఫోసిస్ తర్వాత 45 మంది ఉద్యోగులకు రిలీవింగ్ లెటర్స్ పంపించింది. మరోసారి మార్చిలో 35, ఏప్రిల్ లో తమ కంపెనీ వర్క్ ఫోర్స్ నుంచి 240 మందిని లేఆఫ్స్ నోటీసులిచ్చింది.
►ALSO READ | ఒక్క నెలలో ఇంత పెరిగిందా..? బంగారం ధరలు మళ్లీ పెరిగాయ్.. భారీగా పలికిన తులం ధర
కంపెనీ ఇంటర్నల్ టెస్టులు పాస్ కానివారు పనితీరు సరిగ్గా లేకపోవడం వంటి కారణాల వల్ల ఉద్యోగులను తొలగించింది.తొలగించబడిన వారికి కంపెనీ ఒక నెల జీతం, రిలీవింగ్ లెటర్లు,ఉద్యోగం పొందేందుకు సహాయం కూడా అందించింది. అయితే 2025లో ఇండియాలోనే ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఒకటైన ఇన్ఫోసిస్ 15 వేల మంది ట్రైనీలను నియమించుకుంది.