కాన్పూర్: బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. తాజాగా ఆయన మరో కాంట్రవర్షియల్ కామెంట్ చేశారు. పాకిస్తాన్‌తో పోల్చితే భారత్‌లోనే ముస్లింలు ఎక్కువ మంది ఉన్నారని, అందుకే వారి మైనారిటీ స్టేటస్‌ను తొలగించాలని మహారాజ్ అన్నారు. ఉన్నావ్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సాక్షి మహారాజ్.. ముస్లింలకు రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు.
‘పాకిస్తాన్‌లో కంటే భారత్‌లోనే ముస్లింల జనాభా ఎక్కువగా ఉంది. కాబట్టి ముస్లింలకు ఉన్న మైనారిటీ హోదాను వెంటనే తొలగించాలి. ఇప్పటి నుంచి ముస్లింలు తమను తాము హిందువుల సోదరులుగా భావించి, వారితో కలసి ఈ దేశంలో జీవించాలి. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని పాపులేషన్ లెక్కింపుపై త్వరలో పార్లమెంట్‌లో బిల్లు పెడతాం. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్న వారిని ఎన్నికల్లో అనర్హులుగా ప్రకటిస్తాం’ అని మహారాజ్ పేర్కొన్నారు.