ఆధ్యాత్మికం : ఐర్లాండ్ లో అతిపెద్ద శివలింగం.. అదృష్ట శిలగా విదేశీయుల పూజలు

ఆధ్యాత్మికం : ఐర్లాండ్ లో అతిపెద్ద శివలింగం.. అదృష్ట శిలగా విదేశీయుల పూజలు

ప్రపంచంలోనే అత్యంత రహ స్యమైన శివలింగం ఐర్లాండ్లో ఉంది. మీత్ కౌంటిలోని తారా పర్వత ప్రాంతాల్లో కొలువైన ఈ పొడవాటి శివలింగం వెనక ఎన్నో రహస్యాలు ఉన్నాయి.  వందల ఏళ్ల కిందటే స్థానికులు దీన్ని గుర్తించారు. ఈ శివలింగాన్ని 'లియా ఫె ల్'(అదృష్ట శిల) అని అక్కడి వాళ్లు పిలుస్తుంటారు. ఇదిచుట్టూ రాతి ఇటుకలతో పొడవైన శిలగా ఈ లింగం దర్శనమిస్తుంది. ఈ శివలింగాన్ని ధ్వంసం చేసేందుకు గతంలో చాలా మంది ప్రయత్నించి.. విఫలమయ్యారు. 

క్రీ.శ. 1632–1636 మధ్య కాలంలో ఫ్రెంచ్ సాధువులు. రచించిన 'ది మైనర్స్ ఆఫ్ ది ఫోర్ మాస్టర్స్'లో ఈ శివలింగానికి సంబంధించిన కొన్ని వివరాలు ఉన్నాయి. 'తుథాడి దేవస్' వర్గానికి చెందిన ఓ నేత దీన్ని స్థాపించినట్టు అందులో పేర్కొన్నారు. తుథాడి దేసన్ అంటే 'దను' దేవత పిల్లలు అని అర్థం. వీళ్లు క్రీ.పూ. 1897 నుంచి 1700 వరకు ఐర్లాండ్​ ను పాలించారు. క్రైస్తవ సన్యాసులు ఈ శివలింగాన్ని పునరుత్పతి సామర్థ్యానికి చిహ్నంగా భావించే వారు. అంతేకాదు ఎంతో మంది ఐరిష్ రాజుల పట్టాభిషేకాలు సైతం ఇక్కడే జరిగినట్లు చరిత్ర చెబుతోంది.