సిడ్నీ: ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో బుష్ ఫైర్ బీభత్సం సృష్టిస్తోంది. బల్లారత్ప్రాంతంలో 12 వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో మంటలు వ్యాపించాయని అధికారులు తెలిపారు. బుష్ ఫైర్ కంట్రోల్ తప్పిందని, వేగంగా విస్తరిస్తోందంటూ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు. ఇండ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశించారు.
రాగ్లాన్, బ్యూఫోర్ట్ టౌన్లలో ఉన్న 2 వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వాతావారణ శాఖ కూడా అగ్రి ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. విక్టోరియా స్టేట్‌లో టెంపరేచర్లు 40 డిగ్రీ సెల్సియస్‌కు పెరిగాయంది.