నోయిడాలో 160 మంది రైతుల అరెస్టు

నోయిడాలో 160 మంది రైతుల అరెస్టు

నోయిడా: నోయిడాలోని ‘దళిత్ ప్రేరణ్ స్థల్’ వద్ద నిరసన తెలుపుతున్న 160 మందికి పైగా రైతులను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. లుక్సర్ జైలుకు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో భారతీయ కిసాన్ పరిషత్ నేత సుఖ్ బీర్ సింగ్ ఖలీఫా, పవన్ ఖతానాతో సహా పలువురు మహిళలు, రైతు నాయకులు ఉన్నారు. భూమికి నష్టపరిహారం చెల్లించడంతో పాటు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సంయుక్త కిసాన్ మోర్చా ఢిల్లీ మార్చ్ కు పిలుపునిచ్చింది.

 అయితే, దేశ రాజధానికి బయలుదేరిన రైతులను ‘దళిత్ ప్రేరణ్ స్థల్’ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు అక్కడే నిరసనకు దిగారు. ఏడు రోజుల్లోగా  తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఢిల్లీకి తమ పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తామని హెచ్చరించారు.