మంకీపాక్స్ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను వణికిస్తోంది. కరోనా తర్వాత అంతటి రేంజ్ లో భయానకంగా మారింది ఈ వ్యాధి. ఎంపాక్స్ రూపంలో మానవాళికి ముప్పుగా పరిణమించనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఎంపాక్స్ పిలువబడే మంకీపాక్స్ వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా ఆఫ్రికన్ యూనియన్ హెల్త్ ఏజెన్సీ తెలిపిన లెక్కల ప్రకారం జనవరి నుండి ఆఫ్రికాలో ఏంపాక్స్ కేసులు 18,737కు చేరినట్లు, మృతుల సంఖ్య 541కు చేరినట్లు తెలుస్తోంది.
తొలుత ఆఫ్రికాకే పరిమితమైన ఈ ప్రాణాంతక వైరస్ క్రమంగా ప్రపంచమంతా వేగంగా వ్యాపిస్తోందని, అప్రమత్తంగా లేకుంటే ప్రాణానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని WHO హెచ్చరికలు జారీ చేసింది. గతంలో కూడా మంకీపాక్స్ వైరస్ వెలుగు చూసినప్పటికీ ఈసారి మరింత ప్రమాదకరంగా మారే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఆఫ్రికా దేశాలతో పాటు మన పక్క దేశం పాకిస్థాన్లోనూ ఎంపాక్స్ కేసులు గుర్తించనట్లు WHO ప్రకటించడంతో టెన్షన్ మరింత ఎక్కువైంది.