గూగుల్ షాక్: ప్లేస్టోర్‌లో 20 లక్షలకు పైగా యాప్స్ బ్లాక్

గూగుల్ షాక్: ప్లేస్టోర్‌లో 20 లక్షలకు పైగా యాప్స్ బ్లాక్

మనకు మొబైల్‌లో ఏ యాప్ కావాలన్నా  క్షణాల్లో డౌన్‌లోడ్ చేసుకుంటాము. కానీ వాటి వల్ల ఎంత ప్రమాదం పొంచి ఉందో ఎవరికీ తెలియదు. గూగుల్ తన 2023 నివేదికను విడుదల చేసింది. ప్లే స్టోర్‌లో 2 మిలియన్లకు పైగా యాప్‌లు బ్లాక్ చేసినట్లు తెలిపారు. గూగుల్ ప్లే స్టోర్ నిబంధనలు ఉల్లంఘించన యాప్ అకౌంట్లు బ్లాక్ చేసింది. ఐఫోన్ యూజర్లు యాపిల్ స్టోర్,  ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకుంటారు. యాపిల్ స్టోర్‌లో సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఆపరేటింగ్‌లో ఈసీగా మాల్వేర్ చొరబడుతుంది.

 అయితే కొన్ని యాప్స్ తో పాటు ప్రమాదకరమైన మాల్వేర్ కూడా మీ ఫోన్ లోకి వచ్చి చేరుతుంది. దీని వల్ల మీ ప్రైవసీ దెబ్బతింటుంది. తాజాగా గూగుల్ ప్లేస్టోర్ లో  2 మిలియన్ల యాప్స్ బ్లాక్ చేసింది. ఇవి అంత సేఫ్టీ కావని, వినియోగదారుల డేటా చోరీ అయ్యే అవకాశం ఉండొచ్చని ఈ ప్రమాదకరమైన యాప్ లను ప్లే స్టోర్ నుంచి తీసేశారు. ఈ తరహా యాప్ లు అవసరంలేని వాటికి ఆక్సిస్ అనుమతి అడుగుతాయి. మీరు యాప్ ఇన్‌స్టాల్ చేయగానే లొకేషన్, కాల్స్, గ్యాలరీ, కాంటాక్ట్స్ అలా అన్నింటి పర్మిషన్ తీసుకుంటే మన డేటా ఆ యాప్ సర్వర్లోకి వెళ్లినట్లే.. ఫ్రాడ్ యాప్ ఉచ్చులో మీరు పడకుండా, మీకు తెలియని ప్రమాదరమైన వెబ్ సైట్ లోకి  మిమ్మల్ని తీసుకెళ్లి యాడ్స్ పై క్లిక్ చేయించకుండా ప్లేస్టోర్ ఈ నిర్ణయం తీసుకుంది. యూజర్ల సేఫ్టీకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నట్లు ప్లేస్టోర్ ఈ సందర్భంగా పేర్కొంది.