స్కూల్ బస్సుకు మంటలు.. 25 మంది మృతి

స్కూల్ బస్సుకు మంటలు.. 25 మంది మృతి

బ్యాంకాక్: థాయ్​లాండ్​లో ఘోర ప్రమాదం జరిగింది. ఫీల్డ్ ట్రిప్ నుంచి తిరిగి వస్తుండగా బస్సుకు మంటలు అంటుకోవడంతో ముగ్గురు టీచర్లతో సహా 25 మంది స్కూల్ పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం మధ్యాహ్నం బ్యాంకాక్ శివారులోని పతుమ్​థానిలో ఈ ప్రమాదం జరిగింది.

ఉథాయ్ థాని ప్రావిన్స్​లోని ఖావోఫ్​రయా శంఖారామ్ స్కూల్​కు చెందిన ఆరుగురు టీచర్లతో కలిసి 38 మంది స్టూడెంట్లు బస్సులో ఫీల్డ్ ట్రిప్​కు వెళ్లారు. ఆదివారం తిరిగి వస్తుండగా బస్సు ముందు టైర్ పేలడంతో అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి క్షణాల్లోనే బస్సు అంతటికీ వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది స్పాట్​కు చేరి మంటలను అదుపు చేశారు. గాయాలైనవాళ్లను ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు టీచర్లు, 16 మంది స్టూడెంట్లు ప్రాణాలతో బయటపడ్డారని అధికారులు తెలిపారు. బస్సు కంప్రెస్డ్ గ్యాస్ తో నడుస్తోందని, డివైడర్​ను ఢీకొట్టినప్పుడు గ్యాస్ ట్యాంక్ పేలడంతోనే మంటలు అంటుకున్నాయని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.