అగ్ని ప్రమాదంలో పండ్ల దుకాణాలు దగ్ధం

అగ్ని ప్రమాదంలో పండ్ల దుకాణాలు దగ్ధం

హుజూరాబాద్‌, వెలుగు: కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్  పట్టణంలోని అంబేద్కర్  చౌరస్తాలో సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20కి పైగా పండ్ల దుకాణాలు కాలిపోయాయి. చౌరస్తాలోని 20కి పైగా పండ్ల దుకాణాలు, పూల బండ్లు ఏర్పాటు చేసుకొని వ్యాపారం చేసుకుంటున్నారు. అర్ధరాత్రి పండ్ల దుకాణాల నుంచి మంటలు ఎగిసి పడడంతో స్థానికులు పోలీస్, ఫైర్​ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్  సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. అప్పటికే దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.

ఏసీపీ శ్రీనివాస్​ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్​ రెడ్డి, కాంగ్రెస్​ పార్టీ ఇన్​చార్జి వొడితల ప్రణవ్, బీజేపీ జిల్లా అద్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి  మంగళవారం బాధితులను పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఓ పక్క వాన కురుస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విద్యుత్  షార్ట్  సర్క్యూట్​తో ప్రమాదం జరిగిందా? ఎవరైనా నిప్పంటించారా? అనే కోణంలో  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు