గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం పడుతోంది. మొన్న రాత్రి మొదలైన ముసురు వాన కంటిన్యూగా పడుతూనే ఉంది. సిటీలో వర్షం పడటంతో బల్దియాతో పాటు వాటర్ బోర్డుకు ఫిర్యాదు చేశారు నగర వాసులు. GHMCకి చాలా ఏరియాలో నీళ్లు నిలిచిపోయంటూ 200లకు పైగా ఫిర్యాదు వచ్చాయి. ఇటు డ్రైనేజీ పొంగిపొర్లుతున్నాయని 150పైగానే కంప్లైంట్స్ వచ్చాయి. మరోవైపు 250కు పైగా ఏరియాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. అటు చిన్న బస్తీల్లో డ్రైనేజీ పొంగిపొర్లుతున్నా వాటర్ బోర్డు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు పబ్లిక్.
నిన్న అత్యధికంగా మియాపూర్ లో 4.6 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. షేక్ పేట, జూబ్లీహిల్స్ లో 4.1, మాదాపూర్ లో 3.7, కృష్ణానగర్ లో 3.5, చార్మినార్ 3.3, విజయనగర్ కాలనీలో 3.2 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. చిన్నవర్షానికే బైలెన్ లలో నీళ్లు నిలిచిపోతున్నాయి. మరోవైపు ఇవాళ హైదరాబాద్ కి ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. నగరంలో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో సిటీ జనం అలెర్ట్ గా ఉండాలని GHMC సూచించింది.