దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీల్లో డిగ్రీ కోర్సులో ప్రవేశాలు పొందేందుకు సీయూఈటీ యూజీ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ ఎంట్రన్స్ టెస్ట్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ CUET (UG) 2024 నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష ద్వారా జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇగ్నో, అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ వంటి మరెన్నో ప్రముఖ విద్యాసంస్థల్లో సీటు సంపాదించొచ్చు.
ఈ టెస్ట్‌లో 200 లకు పైగా యూనివర్సిటీలు పాల్గొంటున్నాయని UGC ఛైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ తన అఫీషియల్ ఎక్స్ అకౌంట్ లో ఈరోజు ప్రకటించారు. వాటిలో 46 కేంద్రీయ విద్యాలయాలు, 32 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, 6 ప్రభుత్వ సంస్థలు, 98 ప్రైవేట్, 20 డీమ్డ్ యూనివర్సిటీలు CUET (UG) 2024లో రిజిస్టర్ చేసుకున్నాయట.
So far, 46 Central Universities, 32 State Universities, 20 Deemed-to-be-Universities, 98 Private Universities and 6 Government Institutions have registered for using CUET-UG scores for their admission in UG programmes. More are joining. Details are here.https://t.co/fJJG09QjAg
— Mamidala Jagadesh Kumar (@mamidala90) March 20, 2024
అండర్ గ్రాడ్యుయేట్ చదవడానికి CUET UG 2024 దరఖాస్తులను ఇప్పటికే ప్రారంభమవగా.. మార్చి 26 చివరి తేదిగా నోటిఫికేషన్ లో ప్రకటించారు. మే నెలలో ఈ ప్రవేశ పరీక్ష జరగనుంది. అదే సమయంలో లోక్ సభ ఎన్నికల ఉన్న కారణంగా CUET UG 2024 టెస్ట్ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా సీలు కేటాయిస్తారు.